HHVM: పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా సినిమా చూస్తుంటారు. అయితే ఏపీ ప్రభుత్వం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా జూన్ 24 తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా జూలై 23 తేదీ రాత్రి 9 గంటలకు స్పెషల్ షో వెయ్యనున్నారు. ఈ షోకు 600 రూపాయల వరకూ టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించారు. 24 తేదీ నుంచి సింగిల్ స్కీన్ థియేటర్లలో లోయర్ క్లాస్‌కు 100 రూపాయలు, అప్పర్ క్లాసుకు 150 రూపాయలు, మల్టీ ఫ్లెక్స్‌లో 200 రూపాయల వరకూ టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ పెంచిన ధరలు 24, జూలై 2025 నుంచి 2, ఆగస్టు 2025 వరకూ అనగా 10 రోజులు పాటు అమలులో ఉండనున్నాయి.
Read also- Etela New Party: తెలంగాణలో పెను సంచలనం.. త్వరలో ఈటల కొత్త పార్టీ.. పేరు కూడా ఫిక్స్!
పవర్ స్టార్ పరన కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్సలో దూసుకుపోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాలను మించి ఉన్నాయి. అసలే పవర్ స్టార్ సినిమా అందులోనూ చాలా గ్యాప్ తర్వాత రాబోతుంది కాబట్టి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 42 నిమిషాలపాటు మొఘల్ చక్రవర్తితో వీరమల్లు చేసిన యుద్ధాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని అంచనా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరింత అంచనాలు పెరగడంతో బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Read also- Viral News: మరిదితో వివాహేతర సంబంధం.. భర్తను ఎలా చంపారంటే?
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించారు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని నిర్మాతలు తెలిపారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి తారాగణం నటించింది. ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన స్వరాలు ఇప్పటికే సంగీత ప్రియుల నోట నానుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదలవుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా అసలు సిసలైన పాన్-ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోందని మూవీ టీం తెలిపింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.