Private Education: మీరు ఇసుక దందా చూసి ఉంటారు… భూ దందా చూసి ఉంటారు… కానీ పినపాక (Pinapaka) నియోజకవర్గంలో ఇలా కాదండోయ్… వీటన్నిటికీ విరుద్దంగా ప్రైవేటు విద్యా దందా కొనసాగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలా మజాకా అన్న విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. వారి దందాను ఆపేవారు.. అడ్డుకునే వారే లేకపోవడంతో (Private Education) ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు.
పుస్తకాలు కొనలేక అల్లాడిపోతున్న ప్రజలు
అటు పిల్లల చదువులు ఆపుకోలేక ఇటు ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) తల్లడి పోతున్నారు. ఫీజులు కడితే తమ పిల్లలని ఉంచండి లేకపోతే వేరే స్కూల్ కి పంపించుకోండి అంటూ ప్రైవేటు విద్యాసంస్థల Private Education యాజమాన్యాలు కరాకండిగా చెప్తున్నారు. ఒకపక్క ఫీజులు మరో పక్క స్కూల్ యూనిఫామ్ లు ఇది చాలదన్నట్టు పుస్తకాలు కొనలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. మణుగూరు మండలంలో ప్రైవేట్ విద్యా సంస్థల (Private Education) యాజమాన్యాలు కేవలం మండలంలోని ‘నాగ’రామ” షాపులను ఎంచుకొని ఆ షాపులోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీచేస్తున్నారు.
Also Read: Hard Time for Farmers: పత్తి రైతులకు గడ్డుకాలం.. పంట నగదు నేటికీ రైతుకు చేరని వైనం!
చూసే నాధుడే లేడు
ఆ షాపుల వద్ద అధిక రేట్లకు పుస్తకాలను విక్రయిస్తూ వారి ద్వారా కమిషన్లను పొందుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇంత దందా జరుగుతున్న కనీసం ఇటువైపు చూసే నాధుడే కరువయ్యారు. మామూళ్ల మత్తులో మునిగిపోయి విద్యాశాఖ అధికారులు కళ్ళుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా విద్యాహక్కు చట్టం ఊసే లేదు. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలు దర్జాగా వారి దందాని కొనసాగిస్తున్నారు.
గుదిబండలా మారిన పాఠ్యపుస్తకాలు….
ఒకప్పుడు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఐదు నుంచి పది పుస్తకాలు మాత్రమే ఉండేవి. కానీ నేడు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ జేబులు నింపుకునేందుకు తమ ఇష్టానుసారంగా పుస్తకాలను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ఒక్కొక్క విద్యార్థి సుమారు 30 నుండి 40 కేజీల వరకు స్కూల్ బ్యాగులను మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు బరువులను మోయలేక కుంగిపోతున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. మణుగూరు మండలంలో ఇప్పటివరకు పాఠశాలల తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) కోరుతున్నారు.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!