Hard Time for Farmers( Image credit: swetcha reporter)
తెలంగాణ

Hard Time for Farmers: పత్తి రైతుల ఎదురుచూపులు.. నగదు చేరేదెప్పుడు?

Hard Time for Farmers: విత్తనోత్పత్తికి నడిగడ్డ ప్రాంతం పేరుగాంచింది. ఇక్కడ పంటల సాగుకు కంపెనీలు పోటీపడేవి. ఇక్కడ విత్తన ఉత్పత్తి చేసిన విత్తనాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. కొన్ని సంవత్సరాలుగా సీడ్ సాగు వ్యవస్థపై చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనల కారణంగా ప్రస్తుత సాగుపై అనిశితి నెలకొంది. కంపెనీల ద్వారా ఆర్గనైజర్లు కాటన్ సీడ్ సాగు చేయిస్తుండగా కంపెనీలు, మధ్యవర్తులుగా ఉండే ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతుండగా పండించిన రైతు (Farmer) మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా కుదేలవుతున్నాడు. చివరకు నడిగడ్డలో కాటన్ సీడ్ సాగుకు కంపెనీలు విముఖత చూపుతూ కర్ణాటకలోని గజేంద్ర ఘడ్ లో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండి, లేబర్ కాస్ట్ తక్కువగా ఉండడంతో అక్కడ సీడ్ సాగుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

పండించిన పంటకు కేవలం 20 శాతమే చెల్లింపులు

గత సంవత్సరం కాటన్ సీడ్ ను సాగు చేసి రైతులు (Farmers) పండించిన పంటకు ప్రస్తుతానికి 20 శాతమే కంపెనీలు రైతులకు చెల్లించినట్లు సీడ్ ఆర్గనైజర్లు చెబుతున్నారు. (Jogulamba Gadwal District) జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలో వివిధ కంపెనీల ద్వారా కాటన్ సీడ్ సాగు ద్వారా 2 వేల ప్యాకెట్లకు గాను1000 కోట్ల బిజినెస్ టర్నోవర్ కాగా అందుకు తగ్గట్టు రైతులకు ఏప్రిల్, మే నెలలోనే (Farmer) రైతులకు జమ చేయాల్సి ఉంది. కానీ జులై వచ్చినా నేటికీ పండించిన పంటకు నగదు ఇవ్వకపోవడంతో ప్రస్తుత సాగుకు పెట్టుబడి పెట్టలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

 Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!

కంపెనీలకు హైబ్రిడ్ బిజీ 3 దెబ్బ

కాటన్ సీడ్ కంపెనీలకు హైబ్రిడ్ దెబ్బ కొడుతుంది. జిల్లాలో కంపెనీలు, ఆర్గనైజర్లు రైతుల (Farmer) ద్వారా కాటన్ సీడ్ సాగు చేయించగా వచ్చిన విత్తనాలను సంబంధిత కంపెనీలకు కమర్షియల్ పంట సాగుకు సరఫరా చేసేవి. కానీ ప్రస్తుతం హైబ్రిడ్ బి జీ త్రీ సాగు మహారాష్ట్ర, గుజరాత్ లో అధికంగా ఉండడం దానివల్ల గడ్డి పురుగుల మందు తక్కువగా ఉండడంతో ఆ రకము విత్తనాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీల విత్తనాలకు డిమాండ్ తగ్గి తిరిగి కంపెనీలకు స్టాక్ ఇస్తున్నాయని, దీంతో కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన నగదు చెల్లింపులో జాప్యం చేస్తున్నారు.

జి ఎం ఎస్ సాగుపై కొర్రీలు

జిల్లాలో ప్రస్తుతం 32 వేల ఎకరాలలో జి ఎం ఎస్, కన్వెన్షన్ కాటన్ సీడ్ పంటను సాగు చేస్తున్నారు. జి ఎం ఎస్ లో ఎకరాకు ఐదు కింటాళ్ల దిగుబడి రానుండగా కన్వెన్షన్ పంట సాగు విధానంలో మూడున్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఖరీఫ్ స్టెరల్ సాగుపై కొన్ని కంపెనీలు కేవలం ఎకరాకు క్వింటన్నర మాత్రమే కొనుగోలు చేస్తామని రైతులకు కండిషన్లు పెడుతున్నాయి. ఇప్పటికే స్టాక్ అధికంగా ఉందనే కారణంతో కొన్ని కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా పంటను తీయించే పనికి పూనుకోవడంతో గట్టు, కేటి దొడ్డి మండలాలలో పలు రైతులు (Farmer) సీడ్ పంటను తొలగిస్తున్నారు. గత సంవత్సరం 35 శాతం జీవోటి పరీక్షల్లో విత్తనాలు ఫెయిల్ అవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రాప్ హాలిడే కు దారి తీయనుందా

కంపెనీలు సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తుండడంతో పాటు రైతులకు చెల్లించాల్సిన గత సంవత్సరం సాగు పంట నగదును నేటికీ చెల్లించకపోవడం, ప్రస్తుత పంటల సాగుకు పెట్టుబడులు ఇవ్వకపోవడంతో సాగు చేస్తున్న రైతులు (Farmer) పెట్టుబడులు పెట్టలేక బయట అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగుకు పెట్టుబడులు పెట్టి, కొందరు ఆర్గనైజర్ల ద్వారా జిఎస్ఎమ్ పంటను తొలగించమని సూచిస్తున్నడంతో నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం కంపెనీలపై పారదర్శకత పాటించడంలో భాగంగా లైసెన్స్ లు, జిఎస్టి వివరాలు, కంపెనీ డేటా ఇవ్వాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కోరడంతో పాటు సాగు వివరాలను వెల్లడించాలని సూచించారు. ఇటీవల 35 శాతం విత్తనాలు జిఓటి పరీక్షల్లో ఫెయిల్ కావడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొందరు సబ్ ఆర్గనైజర్లు కమర్షియల్ విత్తనాలు కలపడమే ఈ పరిస్థితికి దాపురించిందని రైతులు (Farmer) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బడా ఆర్గనైజర్లు ఇప్పటి పరిస్థితులను అవగాహన చేసుకుని గజేంద్ర ఘడ్ లో సైతం సాకు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు.

జీవనోపాధి కోల్పోనున్న సాగు రైతులు

నడిగడ్డలో కాటన్ సీడ్ కు ప్రసిద్ధి గాంచింది.. కాగా ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారడంతో కాటన్ సీడ్ సాగుపై గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కంపెనీలు సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా కాటన్ సీడ్ ను 35 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తుండగా దాన్ని సాగు చేస్తున్న రైతులు, పనిచేసే కూలీలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే పరిస్థితి దాపురిస్తుందని రైతులు వాపోతున్నారు. విధిలేక ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సి వస్తుందని, ఈ వాణిజ్య పంట లాభసాటిగా ఉండడంతో కొన్నిసార్లు నష్టాలు వచ్చినా ఈ పంట సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

Also ReadSigachi Pharma Company: సిగాచికి హైలెవల్ కమిటీ.. ప్రమాదంపై అధికారుల పరిశీలన!

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!