సూర్యాపేట, స్వేచ్ఛ : Hanuman Vijaya Yatra: ఏప్రిల్ 12 న జిల్లా కేంద్రంలో జరుగు వీర హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేయాలని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ధరూరి రామానుజాచార్యులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్, జిల్లా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమంతుడు బలపరాక్రమంతుడనీ ,సీతమ్మ జాడ కనుగొనుటకు లంకను చేరి అశోకవనంలో తోకకు అంటించిన నిప్పుతో లంకా దహనం చేసి సీతమ్మ జాడను తెలియజేసిన కారణంగా సందర్భంగా జరుపుకొనే వీర హనుమాన్ విజయ యాత్ర గా జరుపు కుంటున్నామన్నారు.
హనుమంతుడు ఎన్ని యుద్ధాలు చేసినా విజయం తప్ప పరాజయం పొందలేదని,అందుకే ఈ హనుమాన్ విజయ యాత్ర పాల్గొనడం ద్వారా మనందరికీ కూడా విజయం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ విజయ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్ ,బజరంగధళ్ జిల్లా సంయోజక్ పసునూరి దినేష్ బాబు, శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షులు కొత్త ఆంజనేయులు, పట్టణ బజరంగధళ్ సంయోజక్ పున్నం సందీప్ , వి.హెచ్.పి పట్టణ ఉపాధ్యక్షులు బైరు విజయకృష్ణ, సహయ కార్యదర్శి సోమ చంద్రశేఖర్, విద్యార్థి ప్రముఖ్ సాయి తేజ, తండు సత్యనారాయణ, సాప్తయిక్ మిలన్ ప్రముఖ్ పోలగాని ఉపేందర్ , ఏబీవీపీ జిల్లా ఇంచార్జ్ వేణు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు