Ponguleti Srinivas Reddy: అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇందిరమ్మ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్ళు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్ రెడ్డి భరోసా కల్పించారు.
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని వివరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేటలో మునిసిపల్ సాధారణ నిధులు రూ.కోటితో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలో పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దారేడు నుంచి కోటపాడు వరకు రూ.4 కోట్ల 90 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, దారేడు నుంచి కోయచిలకకు రూ.3 కోట్ల 74 లక్షలతో బీటి రోడ్డు మంజూరు చేశామని అన్నారు.
Also Read: Gold Rate ( 04-06-2025) : మహిళలకు షాకింగ్ న్యూస్.. ఈ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
రూ.4 కోట్ల 29 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు
దారెడు గ్రామానికి మొత్తం రూ.8 కోట్లతో రెండు రోడ్లను ఇందిరమ్మ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. మద్దివారి గూడెం నుండి పోలిశెట్టి గూడెం వరకు రూ.3 కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న 2 కిలో మీటర్ల బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వారం రోజులలో పనులు ప్రారంభం అవుతాయని, నాణ్యతతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అన్నారు. తీర్థాల నుండి మద్దివారిగూడెం వరకు రూ.4 కోట్ల 29 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమాంతరంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి నెలా గత పాలకులు చేసిన అప్పులకు రూ.6 వేల 500 కోట్ల రూపాయల కిస్తీ చెల్లిస్తూ, గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Rerd: Raja Singh: రాజాసింగ్ పై చర్యలు.. జాతీయ పార్టీ నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు!