Gadwal News: గ్రామాలలో రాజకీయ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ దాఖలు ప్రక్రియ శనివారం నాటికి ముగిసింది. పంచాయతీ, వార్డులో స్థానాలలో పోటీ అధికంగానే ఉంది. ఈనెల మూడో తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో ఆయా గ్రామాల అధికార పార్టీ నాయకులు, తమ వారు పోటీ చేసే చోట రెబల్స్ తోపాటు ఇతరులను ఉపసంహరింప చేసేలా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడతలో 550 పంచాయతీలకు 3,674 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా,4,839 వార్డులకు గాను 10,194 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
హస్త గతం చేసుకోవాలని
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలలో గ్రామ మండల స్థాయిలో పోటీ చేయబోతోంది. ప్రభుత్వ పథకాల అమలుతో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారనే విశ్వాసంతో అధికార పార్టీ నాయకులు తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల తరహాలో అధికార కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మెజార్టీ పంచాయతీలను తమ ఖాతాలలో వేసుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టు కసరత్తులో భాగంగా మండల,గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలతో సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఎక్కువమంది సర్పంచులు, వార్డు సభ్యులను వారి బలాలు బలహీనతలను గుర్తించి, అన్ని వర్గాలను చేరదీసి గెలిపించుకోవాలని పట్టుదలతో ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంది.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాలకు పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది.పార్టీ స్కీం లతో పాటు గ్రామాల అభివృద్ధి విషయంలో ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారనే విశ్వాసంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి.దీంతో తమ విజయానికి దోహదపడతాయని సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న ఆశావాహులు ఉత్సాహంతో ఉన్నారు.
పట్టు కోసం బీఆర్ఎస్
జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలలో రెండింటిని దక్కించుకున్న బిఆర్ఎస్ అదే స్థాయిలోనే సర్పంచులను గెలిపించుకోవాలని భావిస్తూ తిరిగి ప్రజల్లో పట్టు సాధించాలని ఉవిలువూరుతోంది.జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బిఆర్ఎస్ కు పట్టు ఉండడంతో ఎక్కువమంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వారా భవిష్యత్తులో మిగతా ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఆ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి పంచాయతీల్లో తమ బలం నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా ఎదురుచూస్తోంది. గత పదేళ్లలో ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో గులాబీ నేతలు ప్రజలను కలుస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ అభివృద్ధి కోసం మద్దతిస్తుండడం, తన కేడర్ లోని అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన వారే పోటీలో ఉన్నారు.
కమల వికాసానికి సన్నద్ధం
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు దీటుగా బిజెపి తన కేడర్ ను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే పల్లె యువతలో పట్టున్న బిజెపి అన్ని వర్గాలను కలుపుకొని ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది. అందుకోసం మండల స్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డు అభ్యర్థులు ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తుంది కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు వస్తాయని, కేంద్రం నిధులతోనే అభివృద్ధి సాధ్యం అనే ప్రచారం ప్రారంభించింది కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు. ఎంపీ స్థానాలకు ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేస్తుండగా గ్రామాలలో సైతం ఆ ఓటు బ్యాంకును మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో జిపిలవారీగా అభ్యర్థుల సంఖ్య
జిల్లా. జీపీలు నామినేషన్లు
జోగులాంబ గద్వాల 106. 723
మహబూబ్ నగర్. 139. 926
నారాయణపేట. 67. 372
నాగర్ కర్నూల్. 151. 958
వనపర్తి. 87. 695
Also Read: Samantha Wedding: రాజ్‌తో రెండో పెళ్లి!.. ఫొటోలు పంచుకున్న సామ్.. మాముల్గా లేవుగా..
