Jangaon collector: రకరకాల సమస్యలు, అనేక బాధలు, పట్టించుకునేవారు లేరు. అండగా ఉండేవారు కానరారు.. సార్లు మీరైనా మాకు దారి చూపండి.. మా బాధలు తీర్చండని ప్రజావాణిలో తమ గోడును జిల్లా అధికారులకు వెళ్ళబోసుకున్నారు. బాధితుల గోడను సావదానంగా విన్న కలెక్టర్ రిజ్వాన్ భాషా(collector Rizwan Basha) షేక్‌తో పాటు జిల్లా అధికారులు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మాటిచ్చారు. నిర్వహించిన ప్రజావాణిలో 55దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయం తెలిపింది.
మాభూమిని పట్టాకు ఎక్కలేదు
ఇందులో ఒకరు ఇల్లు కావాలని, ఒకరు పింఛన్ కావాలని, మరొకరు పోలీసుల సాయం కావాలని, మాభూమిని పట్టాకు ఎక్కలేదని ఇలా రకరకాలుగా దరఖాస్తులు రాగా వాటిని సత్వరమే పరష్కారం చూపి వారికి న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన చర్లపెల్లి స్వప్న తన భర్త రమేష్ తనతో కాపురం చేయడం లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తూ, పుట్టింటికి వెళ్ళగొట్టారని నాకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది.
చిల్పురు మండలం ఫత్తేపురం కు చెందిన జాటోత్ వెంకట్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన వ్యక్తి తనకు బోదకాలని తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఇలా అనేక మంది బాధితులు తమ గోడును అధికారులకు వెల్లబోసుకున్నారు. అధికారులు సాద్యమైనంత తొందరలో పరిష్కరిస్తామని మాటిచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్షాలోమ్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపి రామ్, వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read: Wanaparthy Police: వనపర్తిలో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
అదనపు కేంద్రాల ఏర్పాటు తీరనున్న యూరియా కొరత.. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
యూరియా కొరతతో ఇక్కట్లు పడుతున్న రైతులకు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ (collector Rizwan Basha) శుభవార్త చెప్పారు. రైతు ముంగిట్లోకి యూరియాను తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు సొసైటీ, ఆగ్రోస్ కేంద్రాల్లో మాత్రమే యూరియా పంఫిణి చేయడంతో మండలంలోని రైతులంతా ఒక్కచోటనే గుమిగూడటంతో యూరియా బాధలు వర్ణణాతీతంగా మారాయి. తక్కువ బస్తాలు రావడం, ఒకే చోట ఇవ్వడం, రైతులంతా యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా యుద్దాలు చేసిన సందర్బాలకు చెక్ పెడుతూ ఇకనుండి రైతు వేదికల్లోనూ ప్రత్యేకంగా యూరియా అమ్మకాలు చేయాలని నిర్ణయించారు.
ఆధార్ కార్డు, పాస్‌బుక్ లు ఇవ్వాలి
గత ప్రభుత్వంలో కూడా రైతు వేదికల వద్ద యూరియా ఇవ్వడంతో ఇంతలా కష్టాలు రాలేదు. అయితే ఇప్పుడు అదే పద్దతిలో రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు నుంచి చేపట్టుతున్నారని కలెక్టర్ తెలిపారు. జనగామ జిల్లాలో సొసైటీలు, ఆగ్రోస్‌కు తోడుగా రైతు వేదికల వద్ద యూరియా దిగుమతి చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండేందుకు, యూరియా కష్టాల నుంచి గట్టేక్కించేందుకు రైతు వేదిక వద్ద ఇవ్వనున్నామని వివరించారు. యూరియా పంపిణీలో బాధ్యత వహించే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. వ్యవసాయాధికారులు యూరియాను అమ్మకాలు చేస్తారని తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పాస్‌బుక్ లు ఇవ్వాలని సూచించారు.
ఎవ్వరైనా అక్రమంగా నిల్వచేసినా, బ్లాక్ మార్కెట్‌లోఅమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బచ్చన్నపేట మండలంలో సొసైటీతో పాటుగా కట్కూర్, కొన్నే, కొడువటూరు, నాగిరెడ్డిపల్లి, ఇంగంపల్లి, పాలకుర్తి మండలంలోని చెన్నూరు, విస్నూర్, ముత్తారం, గూడూరు, ఈరవెన్ను, చిల్పూర్ మండలం లింగంపల్లి, జనగామ మండలం పెంబర్తి, ఓబుల్ కేశ్వాపూర్ రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు.
Also Read: Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది