Parents Protest: బెస్ట్ అవెలబుల్ స్కీమ్ అన్నారు.. చదువు బాగా చెపుతారు అని సర్కారు పేద పిల్లలకు ప్రైవేటు చదువులు చెప్పిస్తామని మాటిచ్చారు. సీటిచ్చారు.. కానీ ఇప్పుడేమైంది.. బెస్ట్ అవెలెబుల్ స్కీమ్‌లో జాయిన్ అయిన విద్యార్దులకు సర్కారు ఫీజులు ఇవ్వడం లేదని.. మా బిడ్డలను బడికి రావొద్దు అంటున్నారు.. ఇప్పుడు మా బిడ్డల బతుకు వేస్ట్ అయ్యేలా ఉంది.. అయ్యా కలెక్టరయ్యా.. జెర మా మొర ఆలకించండి మా బిడ్డల సదువులకు బకాయి పడ్డ ఫీజులను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోండి అంటూ మొర పెట్టుకున్నారు తల్లిదండ్రులు. మొర వినడం లేదని ఏకంగా కలెక్టరెట్ ఎదుట ఆందోళనకు దిగారు.
Also Read: Vizag Accident: దసరా రోజున కొత్త బైక్.. వారం గడవకముందే యాక్సిడెంట్.. యువకుడు మృత్యువాత
కలెక్టర్ మా మొరను విని ఫీజులు ఇప్పించాలి
మా బిడ్డల కోసం మేము ఆందోళన చేస్తున్నామని, కలెక్టర్ మా మొరను విని ఫీజులు ఇప్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వారాల అనూష, బిర్రు నాగేష్, ప్రవీణ్, ముసిపట్ల కిషోర్, రవీందర్, సంతోష్, రాజు, తాళ్ల పెళ్లి అనూష, మౌనిక, లావణ్య, విమల లు మాట్లాడుతూ బెస్ట్ అవెలబుల్ స్కీమ్‌లో ఎంపికైన విద్యార్థులకు సర్కారు ఫీజు బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బడికి రావొద్దని, ఇంటికి వెళ్ళమని వేధిస్తున్నారని ఆవేధన చెందారు. జిల్లా వ్యాప్తంగా 170మంది విద్యార్ధులు ఈ స్కీమ్‌లో చదువుతున్నారని అన్నారు. సర్కారు ఇకనైనా వీరికి ఫీజు బకాయిలు చెల్లించాలని వేడుకున్నారు. ఫీజులు ఇవ్వకుంటే మా బిడ్డల బతుకులు ఆగమవుతాయని ఆవేధన చెందారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారంకు కృషి చేస్తామని మాటిచ్చారు.
నిలిచిన కొనుగోళ్ళు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన రైతులు
అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా, మార్కెట్ చైర్మన్ ముందే మీ సర్కారులో మా రైతులు గోసలు పట్టడం లేదు.. కనీసం కోసిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కొనే నాధుడే లేడు.. మద్దతు ధర దేవుడెరుగు.. కనీస దర కూడా ఇవ్వడం లేదు.. రాబోయేది మల్లా కేసీఆర్ సర్కారే అంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జనగామ మార్కెట్ యార్డులో రైతులు స్వచ్చందంగా ఆందోళనకు దిగారు. అనేక మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలించారు. అయితే ఆడ్తీదారులు కుమ్ముకై ధాన్యం కు క్వింటాకు రూ.1400కు ధర నిర్ణయించారని రైతులు ఆవేధన చెందారు. వ్యాపారులంతా ఒక్కటై మార్కెట్ సిబ్బంది, పాలకమండలి వ్యాపారులతో కుమ్ముక్కై తక్కువకే ధాన్యం కొంటున్నారని అన్నారు.
రైతులను నిలువు దోపిడి
మూడు రోజుల క్రితం ధాన్యంను క్వింటాకు రూ.1700కు కోనుగోలు చేశారని అన్నారు. ఇప్పుడు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రైతులపై పగబట్టారని రైతులు ఆరోపించారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. కాంటాలు వేయకుండా రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ చైర్మన్ చాంబర్ ముందు ఆందోళన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధికారులతో మాట్లాడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, సరైన ధర ఇవ్వాలని సూచించారు.
రైతులకు సర్కారు న్యాయం చేయడం లేదు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన రైతులతో మాట్లాడి న్యాయం చేస్తానని మాటిచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనకు బీ ఆర్ ఎస్ నాయకురాలు, మార్కెట్ మాజీ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ రైతులకు సర్కారు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. బీ ఆర్ ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని, మద్దతు ధర లభించిందన్నారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత బీ ఆర్ ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, గ్రామాల్లో ఐకేపీ, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Maoist Letter: మావోయిస్టు పార్టీకి మల్లోజుల కీలక వ్యాఖ్యలతో సంచలన లేఖ!
