Panchayat Election: పంచాయతీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల బరిలో యువకులు ముందుకు రావడంతో గ్రామీణ ఎన్నికల వాతావరణం ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్త అభ్యర్థులు పోటీలో నిలవడంతో ప్రచారాన్ని కూడా కొత్త పంతాల్లో నిర్వహిస్తూ ఓటర్ల మనసును ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. తొలివిడ ఇప్పటికే ఊపందుకోగా ఎన్నికల ప్రచారాన్ని గ్రామాల్లో వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, ఇంటింటి ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామాభివృద్ధిపై యువత అవసరం గురించి వివరిస్తున్నారు. మారుతున్న సమయంతో గ్రామాల్లో కూడా అన్ని అంశాల్లో మార్పు రావాలంటూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.
కూలీలను వాడుకుంటు..
మొదటి విడత ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేగం పంచుకుంటుంది అభ్యర్థుల మధ్య పోటీ ప్రచారంలో పెరుగుతుండడంతో రాత్రింబవళ్లు గ్రామాలలో అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నామినేషన్లు వేయాలన్న వీధుల్లో, చేయాలన్న ఇంటింటికి ప్రచారం చేయాలన్న జన బలం చూపించాలని అభ్యర్థులు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం కూలీలను వాడుకుంటున్నారు. మహిళలకు పురుషులకు కూలీలు వేస్తూ ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యంగా యువకులు వార్డుల వారిగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి రోజు పోస్టులు పెడుతున్నారు. తను గ్రామానికి చేసే పనుల గురించి, ఇతర అంశాలపై వీడియోలను రూపొందించి గ్రూపులో పెడుతున్నారు. గ్రామం పై పట్టలేని వారిని, గ్రామాలను పట్టించుకోని వారిని, అభివృద్ధి అంటే తెలియని వారిని ఎన్నుకుంటే గ్రామస్తులకు గ్రామ అభివృద్ధికి కలిగే పరిస్థితిలపై వివరిస్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ రెబల్స్ ను బుజ్జగిస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వాడివేడిగా కొనసాగుతుంది.
Also Read: New Education Policy: తెలంగాణ విద్యాపాలసీలో టీ శాట్ ను భాగస్వామ్యం చేయాలి : వేణుగోపాల్ రెడ్డి
పెరుగుతున్న ఖర్చులు
ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఖర్చులకు వెనుకడుగు వేయకుండా పలువురు అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. మందు, నగదు పంపిణీ కానుకలు అందజేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లతో మాట్లాడటం, రెబల్స్ ను బుజ్జగించడం, తదితర అంశాలపై ముందుకు వెళ్లడానికి తగిన సమయం లేకపోవడంతో ఖర్చులను విచ్చలవిడిగా చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా రియల్ వ్యాపారం అంతగా లేకుండా గ్రామాలలో మాత్రం స్థానిక ప్రచార వేడి రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు.
Also Read: Live-in Relationship: పెళ్లి వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

