Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి మరో కీలక ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రస్తుతం అశ్వాపురంలో ఉన్న భారజల ప్లాంట్‌కు అనుబంధంగా మరో కొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. ఆక్సిజన్ -18 ప్లాంట్ సుమారు రూ. 160 కోట్ల వ్యయంతో 100 కిలోల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను త్వరలోనే జనవరి 31న ఏ.ఈ.సీ ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి చేతులమీదుగా శంఖుస్థాపన అశ్వాపురంలో ప్రారంభించబోతున్నారు.,ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా దీని ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్ -18ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించబోతోంది.అయితే అశ్వాపురంలో ఇలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో 2022లో రూ. 50 కోట్ల వ్యయంతోసుమారు 10 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇక్కడ తొలి ఆక్సిజన్ -18 ప్లాంట్‌ను నెలకొల్పారు. అప్పట్లో ఆక్సిజన్ -18 ఉత్పత్తిలో భాగంగా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, రష్యాల తర్వాత ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఇది విజయవం తంగా నడుస్తోంది.
అణుశక్తి శాఖ రూ. 160 కోట్లు వ్యయం
దీంతో ఇప్పుడు భారీ స్థాయిలో అణుశక్తి శాఖ రూ. 160 కోట్లు వ్యయంతో 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రత్యేకంగా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఆక్సిజన్ ఐసోటోపులలో 16, 17, 18 రకాలు ఉంటాయి. మామూలు నీటిలో ఆక్సిజన్-18 ఐసోటోపు కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పద్ధతులను అనుసరించడం ద్వారా.. దీనిని 95.5 శాతం వరకు పెంచుతారు. ఇది చాలా నాణ్యమైనది. మరీ ముఖ్యంగా, క్యాన్సర్ చికిత్సలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. క్యాన్సర్‌ని గుర్తించడంలో ఆక్సిజన్ -18 ఒక కీలకమైన ట్రేసర్‌గా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో అమెరికా, ముంబైలలో జరిగిన పరిశోధనల్లో ఆక్సిజన్-18 క్యాన్సర్ చికిత్సలో కీలకం అని తేలింది. దీంతో శాస్త్రీయ, వైద్య రంగాల్లో దీని వాడకం గణనీయంగా పెరిగింది.ఇదిలా ఉంటే ఒక గ్రాము ఆక్సిజన్ -18 ధర సుమారు రూ. 10 వేల నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. అశ్వాపురంలో 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు కావడం వల్ల దేశీయంగా ఆక్సిజన్-18 అవసరాలు తీరడమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా లభిస్తుంది.
Also Read: Bhadradri Kothagudem: ఆ జిల్లాలో అధిక వర్షాలతో.. నీట మునిగిన పంటలు అన్నదాతల అవస్థలు

