Nukala Ramachandra Reddy: ఈ ప్రాంత ప్రజల కోసం పరితపించిన ప్రజా నాయకుడు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా జవాన్లపల్లి గ్రామంలో నూకల రంగసాయిరెడ్డి రుక్మిణీదేవి దంపతులకు 1990 జనవరి 11న జన్మించారు. నూకల రామచంద్రారెడ్డి ది భూస్వామ్య కుటుంబం. హైదరాబాదులోని రాజబహదూర్ వెంకట్రామరెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్ లో ఉంటూ దాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియంలో మెట్రిక్యులేషన్ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను కొనసాగించారు.
వందేమాతరం ఉద్యమంలో
నూకల రామచంద్రారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు వందేమాతరం ఉద్యమం ఊపొందుకున్నది. యువత జాగృతమైన వందేమాతరం ఉద్యమంలో పాల్గొంటున్న రోజులవి. ఆ సమయంలోనే వందేమాతరం అంటూ దేశభక్తి ఉప్పొంగిన తరుణంలో రామచంద్రారెడ్డి ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూకల రామచంద్రారెడ్డి కుటుంబం భూస్వామ్య వ్యవస్థకు సంబంధించినది కావడంతో దోపిడీ వ్యవస్థకు సంబంధించినది కాకుండా నాటి నిజాం అనుకూల దేశముఖ లకు వ్యతిరేకంగా రాంచంద్రారెడ్డి కుటుంబం పోరాడింది. ప్రజల తరఫున నిలబడి దీనజనులకు అండదండలు అందించింది.
రాజకీయ ప్రస్థానం
మహబూబాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. పెద్దమనుషుల ఒడంబడిక నేపథ్యంలో మంత్రివర్గంలో మూడు, రెండు నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ వారు పదవులు పంచుకోవాలని, కానీ తెలంగాణలో ఉన్న మూడు వర్గాలను దగ్గరకు తీసుకొని ఐదు మంత్రి పదవులను మాత్రమే ఇచ్చారు. ఆరవ పదవి పొందాల్సిన నూకల రామచంద్రారెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి పదవిని మాత్రమే ఇచ్చారు. ఆ విధంగా 1956లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1957 లో డోర్నకల్ శాసనసభ నియోజకవర్గ ఏర్పడినప్పటి నుంచి 1962 వరకు ఒక దఫా, 1962 నుంచి 67 వరకు, 1967 నుంచి 72 వరకు, మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అప్పట్లో వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కేవలం రామచంద్ర రెడ్డికే దక్కింది. 1969 నుండి 71 మధ్యకాలంలో శాసనసభలో తెలంగాణ ప్రజా సమితి నాయకుడిగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా పనిచేశారు. 1960 నుండి 62 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో వ్యవసాయ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1962 నుంచి 64 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, భూ సంస్కరణలు, పునరాభాస శాఖ మంత్రిగా కొనసాగారు. 19 64 నుంచి 67 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ భూసంస్కరణలు పునరావాస శాఖ మంత్రిగా పనిచేశారు. 1973 జలగం వెంగళరావు మంత్రివర్గంలో ఆర్థిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
పీవీ.నరసింహారావుతో సాన్నిహిత్యం
భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసిన నాయకుడు, బహుభాషా కోవిదుడు, పీవీ నరసింహారావు గారితో నూకల రామచంద్రారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశ నుండే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమైన వందేమాతరం ఉద్యమంలో కూడా వీరిద్దరూ కలిసే పని చేశారు. 1952 నుంచి ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. నీలం సంజీవరెడ్డి గారితో కూడా నూకల రామచంద్రారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉన్నది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో
19 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నూకల రామచంద్రారెడ్డి చురుకుగా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం కూడా వహించారు. తెలంగాణ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు తెలంగాణ ప్రజా సమితి 1971 జనవరి 3న 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఉపసంఘంలో మర్రి చెన్నారెడ్డి, రాజు, బిఎస్ గిరి, మదన్మోహన్, జి వెంకటస్వామి, జై ఈశ్వరి బాయిలతో పాటుగా నూకల రామచంద్రారెడ్డి ముఖ్యులుగా కొనసాగారు. ఉద్యమానికి మద్దతిచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ని కూడా ఏర్పాటు చేశారు.
ప్రజాహితమే తన అభిమతమై
స్థానిక ప్రజా సమస్యలను రైతుల సమస్యలను ముక్కుసూటిగా శాసనసభలో ప్రస్తావించిన నేతగా నూకల రామచంద్రారెడ్డికి పేరు ఉన్నది. దాటవేసే తీరు అవలంబించకుండా సమస్య ఒక కొలిక్కి వచ్చేవరకు పోరాటం చేసిన ఖచ్చితమైన నాయకుడిగా రాంచంద్రారెడ్డి పేరు తెచ్చుకున్నారు. 1958లో రెవెన్యూ పద్దులపై శాసనసభలో ప్రసంగిస్తూ కౌలుదారి చట్టం 47వ సెక్షన్లో లోపాలను బహిర్గతం చేశారు. ఆ చట్టాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన ఆనాడు అమలు చేసిన భూసంస్కరణలకు తన మద్దతు ప్రకటిస్తూ ప్రసంగం చేశారు. కౌలుదారులకు రక్షణ కల్పించే రెవెన్యూ చట్టాల్లో సమూలమైన నిబంధనలను పొందుపరిచారు. పలుకుబడిన అడ్డం పెట్టుకొని ఎవరైనా భూస్వాములు రైతుల భూములను రాయించుకుని ఆక్రమణలకు పాల్పడితే ఆ రైతులకు చట్ట ప్రకారం న్యాయం జరిగే వరకూ రెవెన్యూ శాఖ ద్వారా పట్టాలు వచ్చేలా చేశారు. రైతు పక్షపాతిగా రైతు సంక్షేమ చట్టాలను అమలు పరచడంలో శక్తివంచన లేకుండా కృషి చేశారు.
ఎన్టీఆర్కు స్టూడియో సలహా ఇచ్చిన ఘనుడు
1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగిన సమయంలో ఏంటి రామారావు మద్దతు ఇవ్వలేదు. హైదరాబాదులో ఎన్టీఆర్కు ఆస్తులు ఉన్నాయని నేపథ్యంలో ఆ ఆస్తులు ఉద్యమకారులు ద్వంసం చేస్తే అపారమైన నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ప్రకటన చేశారు. ఇందుకు ఆగ్రహించిన ఎన్టి రామారావు, కృష్ణను ఇంటికి పిలిచి మందలించారు. కథానాయకుడు నాగేశ్వరరావు కూడా జై ఆంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కథానాయక జమున కూడా ఆంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ఉండేది. ఆమెకు గుంటూరులో సినిమా ధియేటర్ ఉండేది జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఆమె సినిమా ధియేటర్లో షోలు నిలిపి వేస్తున్నట్టు బహిరంగ ప్రకటన కూడా చేసింది. ఎన్టీఆర్ ఆమెతో కూడా మాట్లాడి మొత్తానికి సినిమా పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాదుకు తరలించడానికి ఎన్టీ రామారావు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాదులో ఫిల్మ్ స్టూడియో కట్టడానికి ఎన్టీఆర్ను ఒప్పించి మద్రాస్ నుంచి హైదరాబాద్ మతం మార్చడానికి దిశా నిర్దేశం చేశారు.
జన బాంధవుడికి గౌరవస్థానం
మహబూబాబాద్ జిల్లాకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పేరు నమోదు చేశారు. ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామచంద్ర రెడ్డి ఎల్లప్పుడు ప్రజలకు ఎదురుగా ఉండేలా ఆయన విగ్రహ స్థాపనకు శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలు హర్షనీయంగా భావిస్తున్నారు. మహాప్రస్థానం గాంధీయవాదిగా, తెలంగాణ ఉద్యమ నేత, ప్రజా బాంధవుడిగా రాజకీయ ఉద్దండుడిగా నాలుగు సార్లు శాసనసభ్యులుగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా, తన జీవితాన్ని ప్రజా సంక్షేమం కోసం అంకితం చేసిన జననేత 1974లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలో 55 జూలై 27న గుండెపోటుతో కాలధర్మం పొందారు.
చిరకాలం గుర్తిండి పోయేలా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట
మనిషి మన మధ్య లేకపోయినా అతడు కొనసాగించిన సంస్కరణలు మాత్రం మిగిలి ఉండడంతో ఆయన గొప్ప ప్రస్థానాన్ని మహబూబాబాద్ ప్రజలు ఆ చిరకాలం గుర్తిండి పోయేలా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం ఇక్కడి ప్రజలందరి ఆకాంక్ష. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా, నూకల రామచంద్రారెడ్డి జన్మించిన సొంత గ్రామం జమాండ్లపల్లి గ్రామంలో ఆయన విగ్రహాలను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. కుటుంబం నూకల రామచంద్ర రెడ్డి జీవన సహచరి భారతీదేవి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు రాధికా రెడ్డి సరస్వతి రెడ్డి. రాధిక రెడ్డి వివాహం వెలగచర్ల రాజగోపాల్ రెడ్డితో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ కాంపోజిట్ స్టేట్ మాజీ అడ్వకేట్ జనరల్, బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గా పనిచేసి పదవి విరమణ పొందారు. రాజగోపాల్ రెడ్డి రాధిక రెడ్డి దంపతుల కూతురు దీపిక రెడ్డి జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కూచిపూడి నృత్య కళాకారిణి. వేలాది మందిని కళాకారులుగా తీర్చిదిద్దిన నాట్య గురువుగా విశిష్టతను సంపాదించుకున్నారు. 2022 లో తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గా కూడా పనిచేశారు.
Also Read: Kishan Reddy: యువతకు అటల్ బిహారీ వాజపేయి జీవితం స్ఫూర్తిదాయకం : కిషన్ రెడ్డి
నూకల విగ్రహావిష్కరణ సభలో మంత్రి పొంగులేటి
రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంగా, నిరుపేదల ఆశాజ్యోతిగా వెలిగిన మహోన్నత నాయకుడు స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి అని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల పక్షపాతి నూకల వారు భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, తన జీవితాంతం సామాన్యుల కోసమే తపించారని పొంగులేటి కొనియాడారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రిగా ఆయన చేసిన భూ సంస్కరణలు విప్లవాత్మకమైనవని, నేటి తరానికి ఆయనొక దిక్సూచి అని అన్నారు.
చిరస్థాయిగా ఆయన జ్ఞాపకాలు
గిరిజన, లంబాడీ సోదరులను ఎస్టీ జాబితాలోకి చేర్చడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చిరస్థాయిగా ఆయన జ్ఞాపకాలు గత పాలకులు రామచంద్రారెడ్డి గారి విగ్రహ పనులను అసంపూర్తిగా వదిలేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యతగా పూర్తి చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఒక ప్రధాన నీటి కాల్వకు లేదా మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బలరామ్ నాయక్, రఘురామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పలువురు ఎమ్మెల్యేలు, నూకల కుటుంబ సభ్యులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

