Priyadarshini Jurala Project: జూరాల గేట్లకు ప్రమాదం లేదు.
Priyadarshini Jurala Project (imagcredit:swetcha)
నార్త్ తెలంగాణ

Priyadarshini Jurala Project: జూరాల గేట్లకు ఎలాంటి ప్రమాదం లేదు.. ఎస్.ఈ రహిముద్దీన్

Priyadarshini Jurala Project: ఉమ్మడి పాలమూరు జిల్లా వర ప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Priyadarshini Jurala Project)కు ఎలాంటి ప్రమాదం లేదని జూరాల ప్రాజెక్టు ఎస్.ఈ రహిముద్దీన్ తెలిపారు. మొత్తం 62 గేట్లు ఉండగా 2009లో 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన దిగువకు వదిలిన సామర్థ్యం ప్రాజెక్ట్‌కు ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం గేట్ల నిర్వహణలో మరమ్మతుల ప్రక్రియ కొనసాగేది. అందులో భాగంగా 8 గేట్ల రోప్‌లు మార్చేందుకు టెండర్లు పిలిచాం. అందులో భాగంగానే మే రెండవ వారంలో ఏజెన్సీ పనులు ప్రారంభించారు. ఇప్పటికే నాలుగు గేట్లలో రూఫ్(Rup)లు పూర్తయ్యాయి. మరో నాలుగు గేట్ల రూఫ్‌లు మార్చాల్సి ఉంది.

నీటిని వదలడానికి సిద్ధంగా ఉన్నాం

ఆకస్మాత్తుగా ముందస్తు వరదలు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. అయినా గేట్ల రూఫ్‌లకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. మరో 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 8, 9 నెంబర్ గేట్ల రూఫ్ ఎలాంటి సమస్య లేదు. అయినప్పటికీ ఇతర గేట్ల ద్వారా నీటిని వదలడానికి సిద్ధంగా ఉన్నాం. 11 కోట్లతో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. జూరాల డాం కు ఎలాంటి ప్రమాదం లేదు ఎంత వరద వచ్చినా నీటి ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ప్రాజెక్టుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తదు.

Also Read: Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!

నిపుణుల కొరత ఉండటం వల్ల

2009లో అత్యధికంగా వరద ప్రవాహం రావడంతో సాగు భూములలోకి స్వల్పంగా నీరు చేరింది. అంతే తప్ప ఎక్కడ సమస్య తలెత్తలేదు. స్వల్పంగా నీటి లీకేజీలు ఉన్నా వాటిని అరగట్టేందుకు మరమతులు చేపడుతున్నాం. దురదృష్టవశాత్తు గేట్ల మరమతులలో రాష్ట్రంలో కేవలం రెండు ఏజెన్సీలు మాత్రమే పనిచేస్తున్నాయని, గేట్ల మరమ్మతులకు నిపుణుల కొరత ఉండటం వల్ల వారు అన్ని ప్రాజెక్టులలో పనులు చేస్తున్నడంతో కాస్త ఆలస్యం అవుతుంది. వారు పనుల పూర్తిలో నిర్లక్ష్యం వహించడంతో నోటీస్ ఇచ్చి తిరిగి పనులు చేసేలా చర్యలు చేపట్టాం. ఎంత నీటి ప్రవాహం(Water flow) వచ్చినా జూరాల డాంకు ఎలాంటి ప్రమాదం లేదని ఎస్ ఈ రహముద్దిన్ తెలిపారు.

Also Read: YS Jagan: బాబూ.. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..