Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఏసీబీ (ACB) స్పీడ్ పెంచింది. ఐఏఎస్ అధికారి (Arvind Kumar) అరవింద్ కుమార్‌కు నోటీస్ జారీ చేసింది. జూలై1న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 50 కోట్ల రూపాయలను (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ (HMDA) ద్వారా చెల్లించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ చెల్లింపులు జరిగినప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో చెల్లింపులు జరపడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. ఇక, 10కోట్లకు మించి విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపితే రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) నుంచి పర్మిషన్ తీసుకోవాలి.
Also Read: Mini Godowns: ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోదాముల బాధ్యతలు!
అయితే, రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) అనుమతి కూడా తీసుకోకుండానే విదేశీ మారకద్రవ్య రూపంలో చెల్లింపులు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) ఏర్పడిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.
దీంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారి (Arvind Kumar) అరవింద్ కుమార్‌ను 2వ నిందితునిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిని 3వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇక, నోటీసులు జారీ చేసి కేటీఆర్‌ను ఇప్పటి వరకు రెండుసార్లు విచారించారు. దీంట్లో కేటీఆర్ వెల్లడించిన వివరాలపై ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ప్రశ్నించాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు తాజాగా జూలై1న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం (Arvind Kumar) అరవింద్ కుమార్ విదేశాల్లో ఉండటం గమనార్హం.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!