Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచి ఘటన చోటుచేసుకుంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో ఇద్దరు పసి పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి వైద్య సిబ్బంది లేకుండా రోడ్డుపై కుటుంబ సభ్యులే శిశువులను తీసుకువెళ్ళాల్సిన దుస్థితి దాపురించింది.
Also Read: Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!
చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి
వివరాల్లోకి వెళితే ముత్తారం కు చెందిన వాంపెల్లి మురళి సంతానం అయిన 45 రోజుల పసికందును మూడు రోజుల క్రితం, డోర్నకల్ మండలం గోర్లచర్ల కు చెందిన వి.రాము సంతానం అయిన నాలుగు నెలల పసికందులను రెండు రోజుల క్రితం చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి చిల్డ్రన్ విభాగంలో చేర్చారు. చిన్నారులు ఇద్దరికీ ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను అమర్చి వైద్యులు, వైద్య సిబ్బంది సహకారం లేకుండానే వైద్య పరీక్షల కోసం రోడ్డుపై కుటుంబ సభ్యులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కుటుంబ సభ్యులు తీసుకు వెళ్ళిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలాగా మారాయి. ఏంజిఎం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యపు పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చిల్డ్రన్ విభాగంలోని చిన్నారులను వైద్య పరీక్షల కోసం రోడ్డుపై కుటుంబ సభ్యులు తీసుకుపోవాల్సిన పరిస్థితి రావడానికి కారకులైన వైద్యులు వైద్య సిబ్బంది పై కట్ల చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్యలు పునరవృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Warangal Gurukulam: గురుకులంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అధికారాల తీరుపై స్థానికుల ఆగ్రహం!
