Nalgonda SP: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని నల్గొండ ఎస్.పి శరత్ చంద్ర పవర్ (SP Sharath Chandra Power) ఆదేశించారు. మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ము న్సిపల్ కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థులు, ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Nalgonda District: నల్గొండ మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్.. శాసనసభలో బిల్లు ఆమోదం
ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాం తాల్లో 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలు అమల్లో విధంగా అధికారులు దృష్టిలో ఉంచుకొని ఆచరణలో ఉంచాలన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా గుంపులుగా ఉంటూ, నినాదాలు చేయడం, జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడం, ర్యాలీలు నిర్వహించడం వంటి చర్యలకు అవకాశం లేదని వెల్లడించారు.
జాగ్రత్త చర్యలు చేపట్టాలి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్య లుగా పటిష్టమైన బందోబస్తు విధులను నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ప్రత్యేక గస్తీ బృందాల ఏర్పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అవసరమైనప్పుడు అందుబాటు లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం శాంతి యుతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలన్నారు.
Also Read: Nalgonda District: పంచాయతీ ఎన్నికల బహిష్కరణ చేసిన గ్రామం.. డప్పు చాటింపుతో సంచలనంగా మారిన వైనం..!

