Nalgonda District: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్గొండను కార్పొరేషన్‌గా అప్ గ్రేడేషన్ చేస్తూ మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో నల్గొండ(Nalgonda)స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాకు మారింది. 2013లో 34.49 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగిన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోకి చర్లపల్లి, మర్రిగూడ, ఆర్జాల బావి, శేషమ్మ గూడెం, గండ్ర వారి గూడెం, మామిళ్ల గూడెం, కేశరాజు పల్లి గ్రామపంచాయతీలను విలీనం చేశారు. ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో నల్గొండ మున్సిపాలిటీ వైశాల్యం 107.48 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి విస్తరించింది తెలిసిందే.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో..
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్గొండలో 48 వార్డులు, 50 వేల అసెస్ మెంట్స్ (బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇతర ప్రాపర్టీస్) ఉన్నాయి. రెసిడెన్షియల్(Residential), కమర్షియల్(Commercial), సెమీ కమర్షియల్(Semi-commercial), ఇతర పన్నులు మొత్తం డిమాండ్ కలిపి రూ. 20 కోట్ల మేరకు ఉంటుంది. అదేవిధంగా 5,220 ట్రేడ్ లైసెన్స్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే, (ఎన్_69, 565) జాతీయ రహదారులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉందని ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్ గ్రేడేషన్ చేయాలని గత ఏడాది నవంబర్ 15న ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Kmati Reddy Venkat Reddy) ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
Also Read: Sridhar Babu: ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్ నో చేంజ్.. జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి శ్రీధర్ బాబు!
ప్రత్యేక నిధులు
ఈ మేరకు ప్రభుత్వం కార్పొరేషన్ గా మార్చేందుకు నివేదికను సిద్ధం చేసి ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా క్యాబినెట్ ఆ బిల్లును ఆమోదించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డ తో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), మున్సిపల్ డైరెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదించిన నేపథ్యంలో కార్పొరేషన్‌గా మారటం పట్ల నల్గొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా నుంచి కార్పొరేషన్‌గా ఏర్పాటైన నల్గొండకు రానున్న రోజుల్లో ప్రత్యేక నిధులు, అభివృద్ధి పనులు జరగనున్నాయని స్థానిక నేతలతో పాటు ఇక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

