Hanumantha Rao: కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పాటల పల్లకి 12 గంటల కార్యక్రమానికి మైనంపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెదక్‌లో ముందుగా కళాకారులు రాందాస్ చౌరస్తా నుండి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కళాకారులకు జరుగుతున్న అన్యాయాన్ని పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్(Congress) నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao) మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో అర్హులైన కళాకారులను గుర్తించకుండా వారికి నచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్యోగాలు ఇవ్వడం పార్టీ యొక్క ప్రచారానికి వాడుకోవడం జరిగిందని అర్హులైన కళాకారులను విస్మరించారని ఆయన తెలిపారు.
కళాకారులు లేకపోతే తెలంగాణ ఉద్యమమం లేదు
నిజంగా తెలంగాణ ఉద్యమంలో కళాకారులు లేనిదే ఉద్యమం లేదని తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు కావాలని ప్రజలు కోరుకున్నారో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లింది కళాకారులని కళాకారులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన తెలిపారు. నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని 550 మంది కళాకారులు ఉంటే 300 మంది ఫేక్ కళాకారులని వీరిని గుర్తించి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. 12 గంటల పాటు పాటల పల్లకి కార్యక్రమంలో నిజమైన కళాకారులను గుర్తించాలని వారికి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Mahabubabad district: కళ్ళు లేకపోయినా ఐరిష్ టెస్టులా.. మీసేవ కేంద్రాల ఆగడాలు
ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక సలహా మండలి సభ్యులు కళాకారులు నేరెళ్ల కిషోర్(Nerella Kishore) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు ఉద్యమంలా కీలకపాత్ర వహించిన కళాకారులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకొని ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, నేర్నాల రమాదేవి టిపిసిసి కాంగ్రెస్ పార్టీ సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రాగన్న, మెదక్ జిల్లా ఉద్యమ కళాకారులు అధ్యక్షులు గుడాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అల్లీపూర్, రమేష్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మద్యల నర్సింలు కళాప్రసాద్ గ్యార యాకన్నా చీ కోడ్, సాయిలు, సంగారెడ్డి జిల్లా కళాకారులు రాము జమ్మికుంట ప్రభాకర్ కల్వకుంట్ల స్వామి శేఖర్ చారి భూమయ్య పాపయ్య అల్లారం ప్రేమ కుమార్ జిల్లా కళాకారులతో కాంగ్రెస్ నాయకులు మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Rad: Loans for Women: మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊరట