Maoists Arrested( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Maoists Arrested: 20 మంది మావోయిస్టుల అరెస్ట్… భారీగా ఆయుధాల స్వాధీనం!

Maoists Arrested: మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న మొత్తం 20 మంది మావోలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్, చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎనిమిది, ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోకి భద్రతాబలగాలు, ఇతరులు ప్రవేశించకుండా చేయడానికి మావోయిస్టు గెరిల్లా బేస్ స్థాపించేందుకు ఐ ఈ డి లు (బాంబులు) అమర్చారు. ఈ విషయాన్ని గత ఏప్రిల్ 8వ తేదీన ఆదివాసీలు, ఇతరులు కర్రెగుట్ట ప్రాంతంలోకి రావొద్దు అంటూ మావోయిస్టులు ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు.

మావోయిస్టులు గత కొంతకాలంగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో ఇటీవల సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు, చత్తీస్గడ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రేగుట్టలపై సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. కర్రెగుట్టలపై జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా అక్కడ ఆశ్రయం పొందిన సిపిఐ మావోయిస్టులు తప్పించుకునేందుకు చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారనే సమాచారంతో ములుగు జిల్లాలోకి నిషేధిత మావోయిస్టులు ప్రవేశించకుండా ములుగు జిల్లా పోలీస్ మెగా వ్యవస్థను పటిష్టం చేసి అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు.

 Also Read: CM Revanth Reddy: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాలెం ప్రాజెక్టు వద్ద వాహన తనిఖీల్లో ఆరుగురు నిషేధిత మావోయిస్టులు, శనివారం ఉదయం వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మురుమూరు అటవీ ప్రాంతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో మరో ఏడుగురు మావోయిస్టులు, కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టల గంగారం గుత్తి కోయ గ్రామ సమీపంలో చేపట్టిన పెట్రోలింగ్లో ఏడుగురు నిషేధిత మావోయిస్టులను కలిపి మొత్తం 20 మంది మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపారు, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అరెస్టు అయిన మావోల వివరాలు
కట్టం భీమ్, సోడి ఉంగీ, వంజామ్ ముకే, హేమల సుక్కి, కుంజాం ఉంగా, మడకం మాసే, పునేం భీమే, కట్టం జోగా, పునేం భీమే, నూప గంగి, హేమల సన్నీ, ఊకే మాసా, పోడియం లక్క, ఉండం సోముడు, కుంజాం లక్క, మారిగల సుమతి, మడకాం కోసి, పోడియం జోగి, మడవి సీమ, మూసాకి రంజు లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలు 5.56ఎమ్ ఎమ్ ఇన్సాస్ రైఫిల్స్ 3, 7.62 ఎంఎం ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్04, .303 రైఫిల్ ఒకటి, 8 ఎంఎం రైఫిల్ 04, 12 బోర్ వెపన్ cartidges 16, లైవ్ గ్రైనేడ్స్ 02, రూ.58.155 నగదు, వాకి టాకీస్ విత్ యాంటెన్నాస్ 04, రేడియోస్ 06, చార్జిబుల్ బ్యాటరీస్ 02, పార్టీ సాహిత్య పుస్తకాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు