CM Revanth Reddy(image credit; twitter)
తెలంగాణ

CM Revanth Reddy: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!

CM Revanth Reddy: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల టాస్క్ఫోర్స్ నిఘా ఉంచాలని చెప్పారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం హెచ్చరించారు.

 Also Read: GHMC: ఇంజనీరింగ్ నుంచి స్పోర్ట్స్ వింగ్ క్రీడా మైదానాల బదలాయింపు!

ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు? ఎక్కడ నిల్వలులున్నాయి? ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే వివరాలన్నీ అధికారులకు సమాచారం ఉన్నదని. ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు.నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు శుక్రవారం వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 Also Read: Konda Reddy: కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి!

ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు. ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రైతులకు భరోసానిచ్చారు.

ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు. అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు. ప్యాక్డ్ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తన పాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, పాకెట్ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు