Konda Reddy 9imagecredit:swetcha)
తెలంగాణ

Konda Reddy: కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి!

Konda Reddy: త్వరలోనే నిర్దిష్టమైన విత్తన చట్టం తీసుకొస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్కేఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ రైతులకు లాభసాటి వ్యవసాయం ఉండాలని, గిట్టుబాటు ధర రావాలన్నారు. వినియోగదారుడికి సైతం ధరలు అందుబాటులో ఉండాలన్నారు. రైతుల, వినియోగదారుడి శ్రేయస్సును ప్రభుత్వాలు చూడాలన్నారు. సాంప్రదాయపంటలైన పసుపు, చక్కెర కు గిట్టుబాటధర రాక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెరుకు పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయి పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పసుపు పంటకు ప్రాధాన్యం ఇస్తుందని, సాంప్రదాయపంటలను కాపాడుకునేందుకు మంత్రుల సబ్ కమిటీ సైతం వేసిందన్నారు. నిజామాబాద్ కమ్మరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు కమిషన్ ముందుకు సాగుతుందన్నారు.

ములుగులో 3వేల ఎకరాల్లో పంటనష్టం

కేరళ ఏరోడ్ అనే పసుపు విత్తనం లో కూడా కురుకుమిన్ శాతం ఎక్కువగా ఉంటుందని దీంతో గిట్టుబాటు ధర వస్తుందన్నారు. పసుపు పాలిష్ చేసే యంత్రాలను ప్రభుత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశామన్నారు. పరిశోధనకు 30 ఎకరాలు, ప్రాసెస్ యూనిట్ కోసం 40 ఎకరాలు కేటాయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రాసెస్ ఇండస్ట్రీస్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కేసీఆర్ చక్కర పరిశ్రమను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. విత్తనం పండించుకోడానికి తెలంగాణ అనుకూలమైన ప్రాంతం కావడంతో మల్టీనేషనల్ కంపెనీలు అన్ని రకాల విత్తనాలను ఇక్కడ తయారుచేస్తున్నాయన్నారు. కంపెనీల వారు రైతులతో సంబంధం లేకుండా ఆర్గనైజర్లను పెట్టుకొని పనిచేస్తున్నారని కోట్లు గడిస్తున్నారన్నారు. ములుగులో 3వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. దీనిపై కమిషన్ తీవ్రంగా స్పందించి, సంబంధిత కంపెనీ సింజెంటా కంపెనీపై చర్యలకు సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రైతుల హక్కులను హరించకుండా పకడ్బందీ చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించారు. మార్కెట్ చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు.

Also mRead: KTR on CM Revanth: పదివేల కోట్ల స్కాం.. రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు.. కేటీఆర్ హెచ్చరిక!

రైతుకు కొత్త విత్తన చట్టం

రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి మాట్లాడుతూ పసుపు, చక్కెర రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని లేఖరాయనున్నట్లు వెల్లడించారు. సన్నచిన్నకారు రైతులకు యంత్రపరికరాలు ఇవ్వాలని ప్రభుత్వానికిరాతపూర్వకంగా ఇచ్చామన్నారు. పసుపులో యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. యంత్రాలకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదన్నారు. రైతుకు కొత్త విత్తన చట్టం అవసరం ఉందన్నారు. ములుగు, సూర్యాపేట ఘటనలతో కొత్త విత్తన చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. విత్తన చట్టం ఉండాలని రైతు కమిషన్ ప్రతిపాదనలు చేశామన్నారు. ముసాయిదా తయారుచేయాలని చూస్తున్నాం దానికి సంబందించిన కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. సీడ్ చట్టం ప్రకారం నకిలీ విత్తనాలు అమ్మితే ఐదేండ్లు పదేండ్లు జైలుశిక్ష ఉండాలన్నారు.

Also Read: TG on Temple Lands: దేవాలయ భూములకు జీడీపీఎస్ సర్వే.. మూడు జిల్లాల ఎంపిక!

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?