Mulugu District: ఎన్నో ఏళ్ల సాగు నీటి కష్టాలను తీర్చాలని ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో రైతులు తెలంగాణ(Telangana) రాష్ట్ర రైతు సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి(Kodhanda Reddy) ని పలు సమస్యల పైన హైదరాబాద్(Hyderabad) లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలోని తన కార్యాలయంలో కలిశారు. మొక్కజొన్న సాగు చేసి బహుళ జాతి కంపెనీల చేతిలో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించి నష్టపరిహారం ఇప్పించినందుకు కొర్స నర్సింహా మూర్తి, వాసం నాగరాజు రైతులతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింహా మూర్తి మాట్లాడుతూ.. విదేశీ విత్తనోత్పత్తి కంపెనీల చేతిలో మోసపోయిన రైతులకు ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పించినందుకు గ్రామాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కోదండ రెడ్డికి తెలిపారు.
దళారుల దగ్గర అధిక వడ్డీలు
నిజమైన రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వమేనని కొనియాడారు. వ్యవసాయ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు9Min Tummala Nageshwar Rao), జిల్లా మినిస్టర్ సీతక్క మాకు న్యాయం జరిగేలా చేశారని రైతులు అన్నారు. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో దశాబ్దాలు గా ఆదివాసీ రైతులు భూములను సాగు చేస్తూ ఉన్న వారికీ గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వలేదని కోదండ రెడ్డి ముందు వాపోయారు. పట్టాలు లేక పోవడంతో ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రైతు భీమా, వ్యవసాయ రుణాలు అందడం లేదన్నారు.
బ్యాంక్ రుణాలు కూడా రాకపోవడంతో దళారుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకొని అప్పుల పాలు అవుతున్నారని తెలిపారు. అసైన్మెంట్ చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన్ని కోరారు. పాలెం వాగు కాలువకు విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయాలనీ విద్యుత్తు శాఖ, ఇరిగేషన్ శాఖ వారికి ఆదేశించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు కోదండ రెడ్డిని కోరారు. రాచపల్లి, నూగురు, ఒంటి మామిడి, చినగంగారం, జెల్లా కాలని, బర్లగూడెం, రామవరం, చిరుతపల్లి రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
జై కిసాన్ ఎత్తి పోతల ప్రాజెక్ట్
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలోని రైతులకు ఉపయోగబడే విధంగా రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) ముఖ్యమంత్రి జై కిసాన్ ఎత్తి పోతల పథకం ప్రారంభించారన్నారు. అది నేడు నిరపయోగంగా మారిందన్నారు. జై కిసాన్ ఎత్తి పోతల ప్రాజెక్ట్(Jai Kisan Lift Project) ని బాగు చేయాలనీ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి(Kodanda Reddy)ని కోరిన వెంటనే సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. పోడు భూములకు బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడం లేదని కూడా తెలిపారు. అన్ని సమస్యలను క్షుణ్ణంగా విన్న తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సంబంధిత అధికారులతో చర వాణి ద్వారా మాట్లాడారు.
ములుగు ఏజెన్సీ ఆదివాసీ రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారిణి చిత్ర మిశ్రా, ములుగు ఆర్ డి ఓ వెంకటేష్ తో చరవాణి ద్వారా చర్చించగా తక్షణమే అసైన్మెంట్ సర్వే మొదలు పెట్టి పట్టాలు ఇస్తామని ఆర్ డి ఓ వెంకటేష్ తెలిపారు. కొందండ రెడ్డి కలిసిన వారిలో రాచపల్లి, చిరుతహాపల్లి, రామవరం, యోగితానగర్ గ్రామాలకు చెందిన రైతులు శ్యామల గోపి, రాంబాబు, కుర్సం రాము, ఇతర రైతులు ఉన్నారు.
Also Read: TTD: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై చర్యలకు సిద్ధమైన టీటీడీ!
