MLA Veerlapalli Shankar: తన అక్షర పోరాటంతో నిజాం దొరలపాలిట నిప్పుకణంగా మారి జర్నలిస్టుల గౌరవాన్ని పెంచిన మహోన్నత వ్యక్తి షోయబ్ ఉల్లా ఖాన్(Shoaib Ullah Khan) అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) కొనియాడారు. షోయబ్ ఉల్లా ఖాన్ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా టీ డబ్ల్యూ నాయకులతో కలసి షోయబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేసేందుకు ఆయన చేసిన పోరాటం మరపురానిదని అన్నారు. అదేవిధంగా నిజాం పాలనలో జరిగిన అన్యాయాలను, అకృత్యాలను ధైర్యంగా ఎదిరించి పోరాడాడని కొనియాడారు.
రాసినప్పుడు కొందరికి బాధ
చివరికి రజాకారుల చేతిలో తన ప్రాణాలను పోగొట్టుకున్న త్యాగశీలిగని ప్రశంసించారు. నేటి సమాజంలో వార్తల(News) ద్వారా చైతన్యం తీసుకురావాలనుకుంటున్న జర్నలిస్టులు ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన ఆదర్శ మార్గంలో నడిచి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. నికార్సైన జర్నలిజమే సమాజానికి అవసరం ఉందన్నారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రతిబింబించాలని వాస్తవాలు రాసినప్పుడు కొందరికి బాధ కలగవచ్చని కానీ అది తాత్కాలికమే అన్నారు. వాస్తవాలు తెలిస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, వాస్తవాలు రాస్తే కక్షలకు దిగడం సరికాదన్నారు. షాద్ నగర్ లో ప్రస్తుతం మీడియా పరంగా మంచి వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ పీ రఘునాయక్ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని సైతం లెకచేయకుండా జర్నలిజానికి అంకితమైన షోయబుల్లాఖాన్ పోరాట పటిమ నేటి తరం జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని రఘు కొనియాడారు.
Also Read: Hyd News: బాత్రూంకు వెళ్లి తిరిగిరాని ఖైదీ.. పోలీసులు వెళ్లి చూడగా..
చాటిచెప్పిన షోయబుల్లాఖాన్
నిజాం నావాబు ప్రజాకంటక పనులను వార్తల రూపంలో లోకానికి చాటిచెప్పిన షోయబుల్లాఖాన్ తన ప్రాంత విముక్తి కోసం కంకణబద్ధుడై పనిచేశారని, అందుకే తెలంగాణ((Telangana) సమాజం ఆయనను నిరంతరం గర్తుచేసుకుంటూనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శ్రేయబుల్లా ఖాన్ సేవలు స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, టిడబ్ల్యుజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, కేపీ, లక్కాకుల రమేష్ కుమార్, రంగనాథ్, సంజీవ్ కుమార్, సురేష్, రాఘవేందర్ గౌడ్, రాకేష్, నరసింహారెడ్డి, నరేష్, బూర్గుల రమేష్, సాయినాథ్ రెడ్డి, రవితేజ, జగన్, బాలు, దర్శనం శంకర్, నరేందర్ , అప్సర్ ఏ6, కాంగ్రెస్ నాయకులు తాండ్ర విశాల, శ్రవణ్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, అగ్గనూర్ బస్వం, మహమ్మద్ ఇబ్రహీ, రాయికల్ శ్రీనివాస్, సయ్యద్ ఖదీర్, లింగారెడ్డిగూడెం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Medaram Jathara: మేడారం జాతరకు భారీ బడ్జెట్..150 కోట్లు కేటాయించిన సర్కార్