MLA Satyanarayana(Image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

MLA Satyanarayana: కోటి మంది మహిళలను.. కోటీశ్వరులను చేయడమే లక్ష్యం!

MLA Satyanarayana: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) అన్నారు. మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం (Bhupalapally Constituency) కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జరిగిన జనని మండల మహిళా సమాఖ్య కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Also Read: Thummala Nageswara Rao: రైతులను మోసం చేసి ఇప్పుడు మాటలా?.. మంత్రి సవాల్!

మహిళలతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) పునరుద్ఘాటించారు.

 Also Read: BRICS Summit: బ్రిక్స్ సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..