Thummala Nageswara Rao: రైతు సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. గత పదేళ్లలో చేయాల్సిన నిర్వాకాలు అన్నీ చేసి ఇప్పుడు రైతులకు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) నేతలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, రైతుల పక్షాన వకాల్తా పుచ్చుకొని మీడియా ముందు పోటీపడి మాట్లాడటం చూస్తుంటే వారి నిరాశ స్పష్టమవుతుందని అన్నారు. ఆయన విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యత అని మంత్రి తుమ్మల (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం Congress Government) అధికారంలోకి వచ్చాక కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే ₹1.03 లక్షల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు దిగుబడులు పెరగడమే కాకుండా, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయని, దీనితో పల్లెల్లో సంతోషం వెల్లివిరుస్తుంటే బీఆర్ఎస్ (BRS) నాయకులకు కళ్లల్లో కారం కొట్టినట్లుందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా, 2018 నాటి రుణమాఫీ మొత్తాన్ని చివరి సంవత్సరంలో, ఎన్నికల ముందు సగం మందికే చేసిందని తుమ్మల విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాలా తీయించారన్నారు.
Also Read: CM Revanth Reddy: పక్కా వ్యూహంతో ఢిల్లీకి సీఎం.. టీడీపీ బీజేపీకి చెక్ పెట్టేలా ప్లాన్!
కాంగ్రెస్ ప్రభుత్వం విజయాలు..
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో రూ.21 వేల కోట్లు ఒకే దఫా రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేశామని మంత్రి తెలిపారు. గత రెండు పంట కాలాల్లో రూ.13,500 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని, ఈసారి 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామని పేర్కొన్నారు. (Farmers) రైతులకు ఇంత మేలు చేస్తున్న తమ ప్రభుత్వంపై, తమ రాజకీయ జీవితానికి తెలంగాణ సమాజం చరమగీతం పాడుతుందనే భయంతో బీఆర్ఎస్ (BRS) నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యూరియా కొరత ఆరోపణలు హాస్యాస్పదం..
యూరియాపై బీఆర్ఎస్ (BRS) నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం అని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలంలోనే రైతులు 53 లక్షల బస్తాల యూరియా, 20 లక్షల డీఏపీ, 45 లక్షల బస్తాల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా 67 లక్షల బస్తాల యూరియా, 8 లక్షల బస్తాల డీఏపీ, 66 లక్షల బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 6 లక్షల ఎంఓపీ బస్తాలు, 4 లక్షల ఎస్‌ఎస్‌పీ బస్తాలు జిల్లా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిరోజూ సుమారు రెండు లక్షల బస్తాల నుండి మూడు లక్షల బస్తాల వరకు రైతులు ఎరువులను కొనుగోలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నిర్లక్ష్యంపై ప్రశ్నలు..
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలనలో వరదలు, వడగళ్లతో సర్వస్వం కోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయారని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. కంది, మొక్కజొన్న, సన్నధాన్యం పంటలు పండించి మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే ఎక్కడికి పోయారని నిలదీశారు. రుణమాఫీ సమయానికి అమలుకాక, అసలు అవుతుందో లేదో తెలియక చివరి సంవత్సరం వరకు వడ్డీ భారం పెరిగిపోతుంటే అప్పుడు మాట్లాడని నాయకులు ఇప్పుడు ఎటుపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పుడు కూడా సగం మందికే చేసి వదిలేస్తే ఎటుపోయారు ఈ నాయకులు అని ప్రశ్నించారు.
Also Read: Sama Rammohan Reddy: లోకేష్‌తో కేటీఆర్ భేటీ.. ఎందుకు కలిశారో చెప్పాలి!