Seethakka: ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపు దిద్దుకుంటుందని , సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యత అని, పూజారులు – ఆదివాసి సంఘాలు – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క (Seethakka) అన్నారు. ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై మేడారం వన దేవతల పూజారులతో , ఆదివాసి సంఘాల నాయకులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశాన్ని నిర్వహించారు.
ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 విజయవంతం చేయడానికి పూజారుల ఆదివాసి సంఘాల నాయకుల సహకారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జాతర నిర్వహణ పై ఆదివాసి సంఘాల నాయకుల తమ అభిప్రాయాలను తెలుపాలని సూచించారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు గిరిజనుల రాజ్యాంగ బద్దంగా గిరిజనుల హక్కుల ప్రకారం నిర్వహించడానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలని, జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాటు చేయాలని, భక్తులకు సేవలను అందించడానికి ఆదివాసి సంఘాల 500 యువకులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో శాశ్వత ప్రతిపాదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
Also Read: Minister Seethakka: బొకేలు వద్దు.. బ్లాంకెట్లు తీసుకురండి.. మంత్రి సీతక్క కీలక సూచన
జాతర విజయవంతం చేస్తాం
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారుల , ఆదివాసి సంఘాల సలహాలు సూచనలు వారి సమన్వయం తో జాతర విజయవంతం చేస్తామని తెలిపారు. కోట్లాదిమంది భక్తుల విశ్వాసం మేడారం జాతర తరతరాలకు గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని, సమ్మక్క సారలమ్మ వారసులుగా గిరిజనులకు గుర్తింపు లభిస్తుందని, ఆదివాసి సంఘాలు వారి సభ్యుల వివరాలు అధికారులకు అందించాలని పేర్కొన్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకవచేటప్పుడు ఆదివాసి యువజన సంఘాలు సమన్వయం పాటించాలని , వాలంటరీ సభ్యులకు మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి
జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా బంద్ చేయడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ మనన్ భట్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఐటీడీఏ ఏ పి ఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటిడిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Seethakka: గట్టమ్మ దేవాలయం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

