Minister Ponguleti (magecredity:swetcha)
నార్త్ తెలంగాణ

Minister Ponguleti: ఏజెన్సీ జిల్లాను ఆకుపచ్చ జిల్లాగా మర్చాలి.. మంత్రి పొంగులేటి!

Minister Ponguleti: రాష్ట్రంలో ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆకుపచ్చ జిల్లాగా మార్చాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భద్రాది కొత్తగూడెంలో వృక్షార్చన ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ నటరాజ్ మీనాక్షి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో భవిష్యత్తు తరాల వారు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుతూ స్వేచ్ఛ జీవులుగా జీవిస్తారని, అందుకు మన బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అంతేకాకుండా నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించినప్పుడే మొక్కలు నాటిన దానికి ఫలితం ఉంటుందన్నారు.

Also Read: Mahesh Kumar Goud: ఈటల, హరీశ్ సీక్రెట్ మీటింగ్.. టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
అనంతరం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను సామూహిక బాధ్యతగా భావించి ప్రతి కుటుంబం కనీసం ఐదు మొక్కలు నాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ఇలాంటి పర్యావరణ కార్యక్రమాల ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ముఖ్యమైన బాధ్యతగా వ్యక్తిగతంగా తీసుకొని మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు.

రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ హరితహారం మహోత్తరమైన కార్యక్రమమని తెలిపారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read: AP Politics: ప్రజా జీవితంలో ఫెయిల్ అయ్యిందెవరు.. జగన్ వర్సెస్ లోకేష్!

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?