Lokesh Vs Jagan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

AP Politics: ప్రజా జీవితంలో ఫెయిల్ అయ్యిందెవరు.. జగన్ వర్సెస్ లోకేష్!

AP Politics: అవును.. పదో తరగతి (AP SSC) మూల్యాంకనంలో రోజురోజుకూ ఊహించని స్థాయిలో అవకతవకలు బయపడుతున్న పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏపీలో విద్యాశాఖ ఉన్నదా? లేదా? ఇంత జరుగుతున్నా మంత్రి లోకేష్ ఏమైపోయారు? అని సాటి సామాన్యుడికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ (Nara Lokesh) ఫెయిల్ అయ్యారని ఆయన ఆరోపించారు. ఇందుకు కౌంటర్‌గా ఎక్స్ వేదికగా లోకేష్.. ‘ ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్’ అంటూ పెద్ద లేఖే రాసుకొచ్చారు.

Read Also- Narayana Murthy: రాజ్యసభకు పీపుల్స్‌స్టార్ నారాయణ మూర్తి.. ఏ పార్టీ తరఫునంటే?

తండ్రీ, కొడుకు అట్టర్ ప్లాప్..!
సీఎం చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది. 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబుగారూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు. చంద్రబాబు గారూ.. మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను అని ఎక్స్ వేదికగా జగన్ రాసుకొచ్చారు.

Read Also- Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై.. రంగంలోకి మేడమ్!

చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లి..
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే! యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. జీఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన మీ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని మీరు తీసుకొచ్చారు. నేను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్‌లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పదో తరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని వాయిదా వేసాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగింది. రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి గారి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు అని జగన్‌కు ఎక్స్ వేదికగా నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

 

Read Also- Opal Suchata: చెప్పి మరీ గెలిచిన ఓపల్‌ సుచాత.. క్యాన్సర్ నుంచి మిస్ వరల్డ్ వరకు..!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు