Opal Suchata: ఎంతో ఉత్కంఠగా సాగిన మిస్ వరల్డ్ 72వ పోటీల్లో థాయిలాండ్ విజేతగా నిలిచింది. ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ వరల్డ్ కిరీటం కైవసం చేసుకున్నారు. అయితే.. విశ్వసుందరిగా సుచాత నిలవడంతో ఇంతకీ ఆమె ఎవరు? బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటి? భామ రియల్ లైఫ్ ఎలా ఉండేది? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా పలువురు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. ప్రేక్షకుల కోసం ‘స్వేచ్ఛ’ ప్రత్యేకంగా అందిస్తోంది.. ఇంకెందుకు ఆలస్యం చకచకా చదివేయండి మరి..
Read Also- Narayana Murthy: రాజ్యసభకు పీపుల్స్‌స్టార్ నారాయణ మూర్తి.. ఏ పార్టీ తరఫునంటే?
ఎవరీ సుచాత..?
ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. థామసాత్ విశ్వవిద్యాలయంలో (Thammasat University) పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నారు. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వెళ్లింది. అక్కడి నుంచే ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆమెకు థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషలు తెలుసు. మోడల్, అందాల పోటీల్లో పాల్గొనడం హాబీ. ఇప్పటి వరకూ మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 (Miss Universe Thailand 2024) కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ 2024 పోటీలో థాయ్‌లాండ్‌కు ప్రాతినిధ్యం వహించి మూడో రన్నరప్‌గా నిలిచారు. తన జీవితంలో అందాల్లో పోటీల్లో పాల్గొనడం మిరాకిల్ అని చెబుతుంటారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం తనకు అదృష్టం దక్కిందని గర్వంగా చెబుతుంటారు. ఈ ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఈ భామ ఇక్కడ విజేతగా నిలవడమే టార్గెట్ అని.. కచ్చితంగా గెలిచి తీరుతానని ముందుగానే చెప్పేసింది. అంతేకాదు తాను గెలిచి దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఈ మిస్ వరల్డ్ అని కూడా చెప్పి.. అనుకున్నట్లుగానే థాయిలాండ్ బ్యూటీ ప్రపంచ సుందరిగా నిలిచింది.
ఇదొక విషాద గాథ!
16 ఏళ్ల వయస్సులో సుచాతా రొమ్ము కణితికి శస్త్రచికిత్స జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్‌ను డాక్టర్లు తీసేశారు. అప్పట్లో ఈ భామ చాలా అవస్థలు, వేదన అనుభవించింది. అందుకే అప్పట్నుంచి సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటూ ఉంటారు. ముందస్తు చికిత్స, గుర్తింపు అవసరం ఉంటుందని సభల్లో, ఇంటర్వ్యూల్లో ఎక్కువగా చెబుతుంటారు. అంతేకాదు ప్రజలకు అవసరమైన అన్ని విధాల మద్దతును అందిస్తుంటారు. అందుకే మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యమని పలు సందర్భాల్లో తెలిపారు. సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపల్ ఫర్ హర్’లో కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. థాయిలాండ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ, ప్రపంచానికి సేవచేస్తానని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా.. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు కూడా సేకరిస్తుంటారు. కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు కూడా. ఈ విషయాలన్నింటిలో తనకు తల్లి స్పూర్తి అని చెప్పారు.
తెలంగాణ గురించి..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. ఎయిర్ పోర్ట్‌లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయినట్లుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి అని చెబుతూ హ్యాపీగా ఫీలయ్యారు. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్న ఆమె ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చినట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు ఆభరణాలంటే ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటానని చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్‌కు కూడా వెళ్లారు.
Read Also- Miss World 2025: భారత్‌కు నిరాశ.. మిస్ వరల్డ్‌గా నిలిచింది ఎవరంటే..?