Damodar Rajanarsimha: జోగిపేట పట్టణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు పనులను చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) ఆదేశించారు. గెస్ట్ హౌస్‌లో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులతో పలు అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి రోడ్డు వరకు, అజ్జమర్రి రోడ్డు నుంచి రిక్షాకాలనీ మీదుగా అంబేద్కర్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 60 ఫీట్లు రోడ్డు ఏర్పాటు చేయాలని, కమిషనర్, డిప్యూటీ తహీసీల్దార్ లకు ఆదేశించారు. జోగిపేట–అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
రోడ్డు నిర్మాణం పూర్తి అయితే..
బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తి చేయాలనీ మంత్రి ఆదేశించారు. బ్రిడ్జి కు అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జోగిపేట–అజ్జమర్రి మార్గంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బి శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే మెదక్ జిల్లాలోని చిలిపిచెడ్, మండలంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని అందోల్, హత్నూర మండలాల ప్రజలు జోగిపేటకు రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ మార్గంలో బ్రిడ్జితో పాటు నూతన రోడ్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Also Read: Manchu Manoj: పవన్ కళ్యాణ్ వల్లే నా జీవితం మారింది.. మంచు మనోజ్
కుసులూరు–గార్లపల్లి రహదారి నిర్మాణం..
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇందుకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు . మక్త క్యాసారం రోడ్డు నిర్మాణం పనులు, కుసులూరు–గార్లపల్లి రహదారి నిర్మాణం పనుల పురోగతిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు . పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులు, విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్ బి ఎస్‌ఈ వసంత్ నాయక్, ఏ నర్సింహులు , డి ఈ రవీందర్, ఏఈఈ శశాంక్, ఇంచార్జి తహసీల్దారు మధుకర్‌రెడ్డిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు .
Also Read: Vote-for-Note Case: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్