Medak District: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ 30 ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొల్చారం మండలం నర్సాపూర్ నియోజకవర్గం పైతెర గ్రామానికి చెందిన అనిల్ సోమవారం ఉదయం హైదరాబాద్(Hyderabad)లో పార్టీ మీటింగ్ ఉందని వెళ్తున్నానని తల్లి యేసమ్మకు చెప్పి తన కారులో అనిల్ హైద్రాబాద్ కు చేరుకొని గాంధీ భవన్(gandhi Bavan)లో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెదక్(Medak) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనిల్ కారును సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో చిన్నా గణపూర్ శివారులోని మెదక్, రంగంపేట రహదారిపై సబ్స్టేషన్ వద్దకు కారు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. అనీల్ పై కాల్పులు జరిపిన తరువాత ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయి కారు కల్వర్టును ఢీకొన్నట్లు స్పష్టమవుతుంది.
అనీల్ డెడ్ బాడీలో 4 బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు చెపుతున్నారు. సంఘటన స్థలం లో 4 బుల్లెట్లు దొరికాయి. దాడికి పాల్పడ్డ దుండగులు 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సంఘటన స్థలంలో ఆధారాలను బట్టి తెలుస్తుంది. అనిల్ కుడి మోచేయి పై భాగంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఛాతీ భాగంలో 2 బుల్లెట్లు ఉన్నాయని చెబుతున్నారు. మరో బుల్లెట్ భుజం సమీపం నుండు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్ల లభ్యమయ్యాయి. కాల్పులు జరిపిన వెంటనే కారు అదుపు తప్పి కల్వర్టు ను ఢీకొన్నట్లు పోలీసులు బావిస్తున్నారు.
నానక్ రామ్ గూడా భూ వివాదమే కారణమా?
భువివాదాలు సెటిల్మెట్లే కారణమా? అనే కోణంలో పోలీసులు కేసును పరిశోధిస్తున్నారు. నానక్ రామ్ గూడా లోని 6 గుంటల భూమి వివాదం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. భూవివాదం, ఆర్థిక లావాదేవీలు అనిల్ హత్యకు కారణాలుగా పోలీసులు బావిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్
సంఘటన స్థలంలో క్లూస్ టీమ్, పోలీస్‌లు ఆధారాలు సేకరించారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి(CI Rajasekhar Reddy), కొల్చారం ఎస్సై మమ్మద్ గౌస్ సోమవారం రాత్రి నుంచి సంఘటనాస్థలి, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ వద్ద పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం క్లూస్టిమ్ ను రప్పించి క్లూస్ సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు మంగళవారం తెల్లవారుజామున సంఘటన స్థలాన్ని సందర్శించారు. దళిత నాయకుడు అనిల్ కాల్పుల్లో మృతి చెందడంతో కొల్చారం మండలంలోని సంగాయిపేట, రంగంపేట తదితర గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు సిఆర్పిఎఫ్, బలగాలతో సంఘటన స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ డిఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు సందర్శించారు.
Also Read: Students Protest: అన్నంలో పురుగులు నీళ్ల చారు.. అమలుకాని మెనూ అసౌకర్యాల లేమి
నిందితులను త్వరలో పట్టుకుంటాం.. ఎస్పీ
అనీల్ హత్యపై పూర్తి స్థాయిలో అన్నికోనాల్లో దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు కొల్చారం పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని వివరించారు. అనిల్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ముందుగా రోడ్ ప్రమాదం అని గ్రామస్తులు పోన్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఐజి.. చంద్ర శేఖర్ రెడ్డి
సంఘటన స్థలాన్ని ఐజి చంద్ర శేఖర్ రెడ్డి పరిశీలించారు మృతుడు అనిల్ వాడిన కారును పరిశీలించారు. సంఘటనకు సంబంధించి మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనీల్ మృతి బాధించింది
కొల్చారం మండలం వరిగుంతం వద్ద జరిగిన కాల్పుల సంఘటన తీవ్రంగా కలచివేసిందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్(Congress) పార్టీ ఇంచార్జ్, పిసిసి కార్యదర్శి, ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనపై బాధను వ్యక్తపరుస్తూ, సంఘటన స్థలాన్ని పరిశీలించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటూ భవిష్యత్‌లో వారి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుని తల్లిదండ్రులు యేసమ్మ, అనంతయ్యలు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్న సంఘటన చూపరులను కంట తడి పెట్టించింది.
Also Read; Ponnam Prabhakar: ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ స్థంస్థగత పునఃనిర్మాణం పై తుది కసరత్తు
దళిత సంఘాలు..
దళిత నేతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన మెదక్ గుల్షన్ క్లబ్లో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి, మరెల్లి అనిల్ పై తుపాకులతో దాడి చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ ను హత్య చేసిన వారిని తక్షణమే పట్టుకొని శిక్ష విధించాలని కోరుతున్నామన్నారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయవలసి ఉంటుందని వారు డిమాండ్ చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాదిగ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, జంగర్ల గోవర్ధన్, ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆస్త్రగల్ల బాల్రాజ్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, గొషికే, యోహాన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు, గడ్డం ప్రభాకర్, టిఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బంగరిగల్ల, దుర్గయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, అరికెల ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ హవేలీ ఘణపుర్, మండల అధ్యక్షులు, ఏం సంజీవులు, రవి, రాజు, పుర్ర మహేష్, ఉషన్ గల్ల, బాబయ్య, నాయకులు, శ్రీనివాస్, ప్రవీణ్, జాన్, ప్రతాప్, కుమార్, తదితరులు పాల్గొన్నారు..
చేతి పై రాసుకున్న ఫోన్ నెంబర్ ఎవరిది? మృతుడు అనిల్ తన చేతిపై రాసుకున్న ఫోన్ నెంబర్ ఎవరిది అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అనీల్ వాడుతున్న బెంజ్ కారు ఎవరిది? గత 5 నెలలుగా అనిల్ వాడుతున్న బెంజ్ కారు ఆంధ్రప్రదేశ్ రాష్టం కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బావమర్డిదని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అసలు కారు సంబంధించిన వారితో అనిల్‌కు ఉన్న సంబంధాలపై పోలీస్‌లు ఆరా తీస్తున్నారు.
Also Read: Telangana News: త్వరలో తెలంగాణ పదకోశం.. రూపకల్పనలో సాహిత్య అకాడమీ