Medak Collector: ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా (Medak Collector) కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అత్యంత అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు.
Also Read: India VS US Rates: భారత్‌లో ఆహార పదార్థాల రేట్లను యూఎస్‌తో పోల్చిన అమెరికన్.. వీడియో వైరల్
ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు మరియు అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా డౌట్స్ వస్తే చాలా సమస్యలు వస్తాయని, ముందు నుండే సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా నిర్వహించొచ్చని వివరించారు.
సక్సెస్ ఫుల్ గా జరగాలి
ఎన్నికలు ట్రాన్స్ఫరెన్సీ, సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలోఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు,డి పి ఓ యాదయ్య, డి ఈ ఓ రాధకిషన్,ఆర్ డి ఓ లు ,మెదక్. రమాదేవి.. నర్సాపూర్. మహిపాల్ రెడ్డి.. తూఫ్రాన్ జయచంద్రారెడ్డి జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Raed: BC Reservations: బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం: శ్రీనివాస్ గౌడ్
