BC Reservations: బీసీలకు న్యాయబద్ధంగా రావలసిన 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి సంఘం పేరుతో మాధవరెడ్డి(Madhava Reddy), గోపాల్ రెడ్డి(Gopall Reddy)లు అనేక కుట్రలు కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీ(BC)లంతా అగ్గి రాజేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) అన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
బీసీ రిజర్వేషన్లు పెంచడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి నష్టం లేనప్పటికీ బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా అడ్డుకొని తీరాలని తెరవెనుక ఎంతోమంది అగ్రకుల శక్తులు కుటీల ప్రయత్నాలు మొదలు పెట్టారని అందులో భాగంగానే రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి లను ముందు పెట్టి బీసీ రిజర్వేషన్లకు గండిగొట్టి బీసీలను రాజకీయంగా అణిచివేయాలని పథకం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
జీవో విడుదల చేయగానే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లు(Kamareddy Declarations) 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు గానీ రాష్ట్రంలో కులగన చేసినప్పుడు గాని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడు గాని ఎప్పుడూ నోరు ఎత్తని రెడ్డి సంఘం వారు తీరా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో(GO)ను విడుదల చేయగానే రాత్రికి రాత్రే కోర్టులను వేదికగా చేసుకొని బీసీ(BC)లకు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీసీల పక్షాన ధర్మం న్యాయం ఉన్నదనీ హైకోర్టు(High Cort)లో సుప్రీంకోర్టు(Supreme Court)లో బీసీలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం తమకుందన్నారు ఒకవేళ బీసీ రిజర్వేషన్లు తగ్గితే చరిత్రలో మాధవరెడ్డి(Madhava Reddy), గోపాల్ రెడ్డి(Gopall Reddy)లు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని వారిని చరిత్ర క్షమించాలని ఆయన అన్నారు .బీసీ రిజర్వేషన్లను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
Also Read: Mahabubabad District: పల్లెల్లో రాజుకుంటున్న రాజకీయ వేడి.. గంగారం మండలం పై ఫుల్ ఫోకస్

