Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 18 మండలాలు కాగా, ఒక్క గంగారం(Gangaram) మండలం మాత్రమే జనరల్ కేటగిరి వరించింది. దీంతో జడ్పీ చైర్మన్ పై కన్నేసిన ఓసి సామాజిక వర్గాల రాజకీయ నాయకులు, ప్రత్యేకించి రెడ్డి(Reddy) సామాజిక వర్గ నాయకులు ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీ, ప్రతిపక్ష హోదాలో ఉన్న టిఆర్ఎస్(BRS) పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే బిజెపి(BJP) పార్టీలు సైతం గంగారం మండలం పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక్కడ జెడ్పిటిసి(ZPTC) స్థానాన్ని కైవసం చేసుకుంటే జడ్పీ చైర్మన్ పీఠం దక్కినట్టేననేది ఆ మూడు పార్టీల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఆ మూడు పార్టీల నుంచి ఆర్థిక, సామాజిక బలం ఉన్న నేతలను బరిలో దింపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత జిల్లాలోని ముగ్గురు ప్రముఖ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ గంగారం స్థానం ఇంకా ఎవరికి ఖరారు కాలేదు.
Also Read: OTT Movie: మాజీ సైనికులు ఆర్మీగా ఏర్పడి.. మైండ్ గేమ్ యాక్షన్ థ్రిల్లర్..
కోర్టు స్టే తర్వాత పూర్తి రంగంలోకి..
తెలంగాణ హైకోర్టు(High Cort)లో స్టే నడుస్తున్న కారణంగా గంగారం జడ్పిటిసి(ZPTC) స్థానం విషయంలో కొంతమంది ప్రముఖు నాయకులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 8 తర్వాత కోర్టుకు సంబంధించిన స్టే విషయంలో గంగారం జడ్పిటిసి స్థానం రిజర్వేషన్ మారుతాయా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది. హైకోర్టు స్టే తర్వాత గంగారం అదే జనరల్ సీటు జడ్పిటిసి కి కేటాయించినట్లయితే అక్కడ రాజకీయ రణరంగం మొదలయ్యే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి జెడ్పి చైర్మన్ పీఠం దక్కించుకునే వ్యక్తినే బరిలోకి దించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు టిఆర్ఎస్ పార్టీ అటు బిజెపి పార్టీలు ఆచితూచి వ్యవహరించి అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలను మొదలుపెట్టారు. ఇంకా ఈ రెండు పార్టీలకు పోటీ చేసేందుకు స్పష్టమైన నాయకులు ఇంకా వెలుగులోకి రాలేదని చర్చ సాగుతోంది.
ప్రస్తుత మండల అధ్యక్షుడు సైతం..
గత కొంతకాలంగా కాంగ్రెస్(Congress) పార్టీకి గంగారం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్న జాడీ వెంకటేశ్వర్లు(Jadi Venkateswarlu) గంగారం జడ్పిటిసి(ZPTC) స్థానాన్ని వదులుకునే పరిస్థితి లేదనే వాదం వినిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పరిస్థితులపై ఏం జరుగుతుందో కూడా క్లారిటీ రాలేదనే చర్చ సాగుతుండడం గమనార్హం. మొత్తానికి కోర్టు స్టే వెలువడగానే స్తానికంగా గంగారంలో పట్టుసాదించండం కోసం కతుహలం చూపిస్తున్నాయి.
Also Read: Telangana BJP: ఎవరికి వారు గీతగీసుకున్న బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు.. భయంతో లీడర్లు
