Maoist Leader Cremation (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Maoist Leader Cremation: గాజర్ల రవి అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం

Maoist Leader Cremation: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో అల్లూరి జిల్లా మారెడిమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో 18 తేదిన జరిగిన ఎన్కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అత్యక్రియలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆయన స్వగ్రామం వెలిశాలలో ప్రారంభం అయ్యాయి. గాజర్ల రవి మృతదేహాన్ని పోలీసులు గురువారం అర్ధరాత్రి తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఉద్యమం కోసం పని చేసిన వ్యక్తి

ఉదయానికి వెలిశాల గ్రామానికి మ‌ృత దేహం చేరుకుంది. గాజర్ల రవిని చివరి చూపు చూసి నివాళి అర్పించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో చేరుకుని రవి మృత దేహానికి నివాళి అర్పించారు. గ్రామస్థులు రవి మృతి చూసి కన్నీటి పర్యంతంఅయ్యారు. గాజర్ల కుటుంబం నుంచి మావోయిస్ట్ ఉద్యమం కోసం పని చేసి అసువులు భాసిన ఆరో వ్యక్తి రవి అని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు భారీగా తరలి వచ్చారు. గాజర్ల కుటుంబ అభిమానులు, మావోయిస్టు సానుభూతి పరులు, కవులు, కళాకారులు, పౌర సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

Also Read: Kavitha: కలత చెందిన కవిత?.. పార్టీలో చర్చనీయాంశం!

గాజర్లది బూటకపు ఎన్ కౌంటర్

విరసం, పౌర హక్కుల సంఘాల నేతలు, తెలంగాణ మావోయిస్ట్ అమరుల కుటుంబ సభ్యులు, బంధువులు గాజర్ల రవి కడసారి చూపుకోసం కదలి భారీగా పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ విప్లవోద్యమ చరిత్ర విని ప్రజానీకం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాజర్లది బూటకపు ఎన్ కౌంటర్ అంటున్న ప్రజా సంఘాలు. సుప్రీం కోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు నేతలు డిమాండ్ చేశారు.

Also Read: Eatala Rajender: దమ్ముంటే రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోవాలి!

 

 

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?