Eatala Rajender( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics

Eatala Rajender: దమ్ముంటే రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోవాలి!

Eatala Rajender: కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్న నమ్మకం తనకు లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress)  ప్రభుత్వానికి దమ్ముంటే రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోవాలని సూచించారు. (Secunderabad) సికింద్రాబాద్‌లో ఆయన  మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ (CBI)  విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అన్నింటికంటే ముందు డ్యామేజ్ అయిన మేడిగడ్డను రిపేర్ చేసి ప్రజలకు నీరు అందించాలన్నారు.

 Also Read: Harish Rao: సీఎంకు బేసిన్‌లపై నాలెడ్జ్ లేదు.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదని, వాటిని ఏటీఎంగా మార్చుకుని దోచుకోవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాళేశ్వరం(Kaleswaram) వంటి పెద్ద ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉంటుందా అని ఈటల ప్రశ్నించారు. డిపార్ట్‌మెంట్లలో ఏ చిన్న నిర్ణయమైనా క్యాబినెట్‌లో పెట్టండని కేసీఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. కాంగ్రెస్ (Congress)  జలయజ్ఞం నుంచే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వచ్చిందని, అందులో కొత్తగా వచ్చి చేరినవి మూడే అని, అవే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అంటూ ఈటల వివరించారు.

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు రాష్ట్రం తీరు మారిందని ఈటల విమర్శించారు. అధికారంలో ఉన్నది గూడు కట్టించే ప్రభుత్వం కాదని, కులగొట్టే సర్కారు అంటూ విమర్శలు చేశారు. హైడ్రా (HYDRA) పేరుతో పేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 22న ఇంపీరియల్ గార్డెన్‌లో వికసిత్ సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ (Bandi Sanjay) హాజరవుతారని, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఈటల వివరించారు.

 Also Read: GHMC Commissioner: డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిష్కరించాలి!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?