Mahabubabad Police: ప్రభుత్వ నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నిరోధించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మణుగూరు బస్ స్టాండ్, వివిధ ప్రధాన కూడళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల నుంచి ఫింగర్ ప్రింట్స్ స్కానర్ ద్వారా వివరాలు సేకరించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా పోలీసులు చేపట్టిన ‘చైతన్యం-డ్రగ్స్‌పై యుద్ధం’ అనే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Also Read: Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం.. 64.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు!
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసుల కృషి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారి సమాచారాన్ని పోలీసులకు అందించి, బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన సూచించారు. మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధిత గంజాయి, మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తూ, విక్రయిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అవసరమైతే, ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్రమార్కులపై పీడీ యాక్ట్‌లు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగేశ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం.. 64.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు!
‘ఏసీబీ అధికారులం అంటూ ఆర్టీఏ అధికారికి టోకరా
ఏసీబీ అధికారులమని చెప్పుకొని, వరంగల్‌లోని ఆర్టీఏ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. కేవలం ఫోన్ ద్వారా బెదిరించి ఆ అధికారి నుంచి ఏకంగా రూ.10 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాము ఏసీబీ అధికారులమని, అరెస్టు చేయడానికి వస్తున్నామని నమ్మబలికాడు.
వాక్కైన ఆర్టీఏ అధికారి
ఈ బెదిరింపులకు భయపడిన సదరు అధికారి, వెంటనే రూ.2 లక్షలు ఆన్‌లైన్ ద్వారా మోసగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి బెదిరించగా, అధికారి మరో రూ.8 లక్షలు బదిలీ చేశారు. ఈ విధంగా మొత్తం రూ.10 లక్షలు స్వాహా అయిన తర్వాత బాధితుడు తేరుకున్నాడు. మోసపోయిన విషయంపై అనుమానం వచ్చి, బాధితుడు ఏసీబీ అధికారులకు నేరుగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకోగా, తమకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. దీంతో అవాక్కైన ఆర్టీఏ అధికారి, తాను మోసపోయానని గ్రహించి, మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mahabubabad District: రూ.20 ఆశ చూపి.. కాంట్రాక్టర్ అమానవీయ చర్య..
