Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన కురిసింది. మహబూబాబాద్(Mahabubabad) సరిహద్దు జిల్లాలు ములుగు(Mulugu), కొత్తగూడెం(Kothagudem), ఖమ్మం(Khammam) జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదయింది. ఈ మూడు జిల్లాల్లో రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా..
కొత్తగూడలో 91.2, గంగారంలో 88.4, బయ్యారంలో 72.4, గార్లలో 35.8, డోర్నకల్ లో 43.6, కురవిలో 132.4, మహబూబాబాద్ లో 109.6, నెల్లికుదురు లో 33.2, కేసముద్రం లో 53.6, నరసింహుల పేట 57.4, చిన్నగూడూరు 83.8, మరిపెడ 52. 4, దంతాలపల్లి 28.2, తొర్రూరు 42.4, పెద్ద వంగర 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా యావరేజ్ గా 64.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా, జిల్లాలో అత్యధికంగా కురవిలో 132.4, అత్యల్పంగా పెద్ద వంగరలో 21.6 వర్షపాతం నమోదయింది.
Also Read; BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్త..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత మండల, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Advait Kumar Singh) సూచించారు. అధిక వర్షాలు నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిత్యం పరిస్థితిని గమనిస్తూ ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. చెరువులు, కుంటలు,, నో లెవెల్ వంతెనలు, బ్రిడ్జిలు వంటి ప్రదేశాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున సామాన్య ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపల వేటకు వెళ్లకూడద, ప్రయాణాలు సాగించే వద్దని, గొర్రెలు, పశువుల కాపర్లు, వ్యవసాయదారులు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ ఉండాలని సూచించారు. రెవెన్యూ(Revenue), పోలీస్(Police), పంచాయతీరాజ్ సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్థానిక తహసీల్దారులు, పోలీసు అధికారులకు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ఆదేశాలు జారీ చేశారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం(Kothagudem) ఉపరితల గనిలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 25 వేల క్యూబిక్ మీటర్ల(ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. గనిలో చేరిన సుమారు ఆరు వందల లక్షల గ్యాలన్ల వరద నీటిని 6 భారీ మోటార్ల సహాయంతో సిబ్బంది బయటకి తోడేస్తున్నారు.
Also Read; Minister Adluri Lakshman: గుడ్ న్యూస్.. 4092 గురుకుల ఉద్యోగుల సేవలు పునరుద్ధరణ
