Mahabubabad District: సెప్టెంబర్ 8 న రాష్ట్రం లోని MLA క్యాంపు కార్యాలయల ముట్టడికి జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్ల సమ్మయ్య(Chitti Malla Sammayya) పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలోని మాల విద్యార్థి, యువకులు, మాల మహానాడు సంఘాలు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి రావాలని స్పష్టం చేశారు.
మాలలపట్ల సవతి తల్లి ప్రేమ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాలలపట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తూ అణిచివేస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. దళితుల మధ్య అగాధలు సృష్టించి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జీవో నెంబర్ 99 తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని వాపోయారు. రోస్టర్ పాయింట్ 22 నుండి 16 పాయింట్ కు తగ్గించాలని ఆ విధంగా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం నోరైనా మెదపకుండా మాల సోదర, సోదరీమణులకు, విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నోరు మెదపడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు(MLA) మంత్రులు అందరూ ఒక్కతాటి పైకి వచ్చి మాల ప్రజాపతినిధులు అసెంబ్లీలో చర్చించాలని కోరారు.
Also Read: OG Advance Bookings: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వాటిని దాటేసిన ‘ఓజీ’.. ఇదెక్కడి మాసురా మామా..
ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ
అసెంబ్లీలో చర్చించకుండా మాలలకు అన్యాయం చేస్తూ ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడించి రాష్ట్రవ్యాప్తంగా మాల సోదరులందరూ మాల ఎమ్మెల్యేలు మంత్రులపై తిరగబడే రోజులు వస్తాయని గుర్తించుకోవాలని హెచ్చరించారు. మాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ సెప్టెంబర్ 8వ తారీఖున 119 నియోజకవర్గాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయన్నీ ముట్టడిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని మాల సోదరీ సోదరీమణులు అందరూ ప్రతి జిల్లాలో ప్రతి మండల గ్రామాల నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి తరలిరావాలని తెలంగాణ రాష్ట్రం మాల మహానాడు పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల సమ్మయ్య పిలుపునిచ్చారు. అదేవిధంగా జీవో నెంబర్ 99 ప్రతులను దగ్ధం చేయాలని కోరారు. మాలల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఎవరు చూసినా ఎన్ని కుట్రలు చేసిన సహించేది లేదని మాల సోదరులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా చిట్టి మల్ల సమ్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: Kavitha: గులాబీ నేతల్లో కవిత బాంబులు.. ఎవరి పేరు బయటపడుతుందో భయం?