Maoists Surrender: నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న
Maoists Surrender ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Maoists Surrender: నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు కీలక నేతలు!

Maoists Surrender: తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ తగలనుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దుల గూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాజీ నారాయణ, కంకణాల రాజిరెడ్డి తో పాటు మరో 20 మంది వివిధ కేడర్లలో ఉన్న మావోయిస్టులు లొంగిపోనున్నారని సమాచారం.  మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్ర లొంగిపోయేందుకే మొగ్గుడిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఒడిదుడుకుల నేపథ్యంలో మావోయిస్టులు అందరూ  చూపుతున్నారు.

Also Read: Maoist Surrender: మావోయిస్టులకు భారీ షాక్.. 103 మంది మావోయిస్టులు లొంగుబాటు

హిడ్మా అనుచరులు 19 మంది

ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన మావోయిస్టులు కొయ్యడ సాంబయ్య అప్పాజీ నారాయణ కంకణాల రాజిరెడ్డి తో పాటు మరో 20 మంది వివిధ కేడర్లలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయేందుకు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు మోస్ట్ వాంటెడ్ హిడ్మా తో పాటు 13 మంది మృతి చెందడం మావోయిస్టు పార్టీలో అతలాకుతలం చేసింది. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ హిడ్మా అనుచరులు 19 మంది, కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జి అనుచరులు 9 మంది విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆటోనగర్ ప్రాంతంలో ని ఓ భవనంలో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అంతేకాకుండా ఏలూరులో 15 మంది, కాకినాడలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు మానసికంగా కృంగిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయినందుకు సంసిద్ధులవుతున్నారని తెలుస్తుంది.

కుంగదీసిన మారేడుమిల్లి ఎన్కౌంటర్

మావోయిస్టు పార్టీని మారేడుమిల్లి ఎన్కౌంటర్ కుంగదీసింది. నాటినుండి మావోయిస్టులు అడవుల్లో సంచరించాలన్న.. తమ కార్యకలాపాలను సాధించాలన్న వణికి పోయే పరిస్థితి నెలకొంది. అయితే అటు కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జి, ఆజాద్ లు తెలంగాణ ఎస్ ఐ బి కంట్రోల్లో ఉన్నారని వార్తలు వెలుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య, డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాజీ నారాయణ, కంకణాల రాజిరెడ్డి తోపాటు మరో 20 మంది పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రణాళిక రచించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులందరూ మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ ఎదుట లొంగిపోయేందుకు సన్నద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం.

Also Read:Maoists Surrender: మావోయిస్టులకు మరో భారీ షాక్.. పెద్ద సంఖ్యలో సరెండర్.. ఎక్కడంటే? 

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?