Maoist Surrender: బీజాపూర్ లో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయారు. ఈ ఘటనతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్ లో స్వచ్ఛందంగా ఆయుధాలను విడిచిపెట్టి సమాజంలో జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో 49 మంది మావోయిస్టు ఒక కోటి రూపాయల రివార్డు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఒక డివిసిఎం, నలుగురు పీ పీసీఎం, మరో నలుగురు ఏసీఎం, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు మలేషియా కమాండర్లు, డిప్యూటీ కమాండర్లు, నలుగురు జనతాన ప్రభుత్వ అధ్యక్షుడు, 22 మంది జనతాన ప్రభుత్వ సభ్యులు, 23 మంది మలీషియ ప్లాటు సభ్యులు ఉన్నారు.
స్వచ్ఛందంగా లొంగిపోయి..
ఇందులో చురుకైన మావోయిస్టులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. బీజాపూర్(Bijapur)లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ దంతవాడ రేంజ్ కమలోచన్ కస్యాప్, డిగ్ కేరీపు సెక్టార్ బిఎస్ నేగి, బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్(Jitendra Kumar Yadav), కమాండెంట్ ఎస్డిఎఫ్, డిఆర్జి సీనియర్ అధికారులు, కెరీపు బెటాలియన్లు, ఇతర పోలీస్ అధికారులు ఎదుట మావోయిస్టులు 103 స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Also Read: Republic: ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు.. సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి కూడా!
నక్సల్స్ సంస్థ యొక్క బలహీనమైన పరిస్థితి
ప్రస్తుతం డేటా ప్రకారం 2025 జనవరి 1 నుండి 421 మందిని పోలీసులు మావోయిస్టులను అరెస్టు చేశారు. 410 మంది లొంగిపోయారు. 137 మంది వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. అదే సమయంలో జనవరి 1, 2024 నుంచి 924 మందిని అరెస్టు చేసినట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు. 599 మంది స్వచ్ఛందంగా లుంగీ పోయినట్లుగా తెలిపారు. 195 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత చెందారు. నక్సలైట్ల సామూహిక స్థావరం నిరంతరం తగ్గిపోతుందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: MLA Kaushik Reddy: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయం: కౌశిక్ రెడ్డి
