Mahabubabad (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో నయా మోసం

Mahabubabad: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని రూ లక్ష తీసుకున్న పంచాయతీ సెక్రెటరీ వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెలితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

లంచం తీసుకున్న పంచాయితీ సెక్రెటరీ

తమ వద్ద లంచం తీసుకున్న సెక్రెటరీని అని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అందుకు బాధ్యుడైన కార్యదర్శి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి తమ వద్ద డబ్బులు తీసుకున్న పంచాయతీ సెక్రెటరీపై జిల్లా ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన తమకు ఇల్లు రాకుండా చేసిన కార్యదర్శి పై పూర్తి విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Also Read: Bala Bharosa: బాల భ‌రోసా పేరుతో కొత్త స్కీం.. మంత్రి సీతక్కవెల్లడి!

పథకం యోక్క లక్ష్యం

ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన గృహనిర్మాణ పథకం, దీని యోక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు మరియు ఇల్లు లేనివారికి స్థిరమైన గృహాలను అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అని మనందరికి తెలిసిన విషయమే, 2024 మార్చి 11నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించారు. ఈ పథకం కింద, సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టు కోవడవ కోసం 5 లక్షల ఆర్థిక సహాయం, స్థలం లేనివారికి ఉచితంగా స్థలం మరియు రూ. 5 లక్షల సహాయం అందించనున్నారు. బడుగు బలహీనులైన SC/ST వర్గాల వారికి రూ. 6 లక్షల వరకు సహాయం అందించనున్నారు.

Also Read: Honeymoon Tragedy: మరో హనీమూన్ జంట మాయం.. 12 రోజుల నుంచి మిస్సింగ్

 

 

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు