Honeymoon Tragedy: మధ్యప్రదేశ్‌కు చెందిన నూతన దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి మిస్సింగ్ అయిన వ్యవహారంలో ఎన్ని ట్విస్టులు వెలుగుచూశాయో తెలిసిందే. ప్రియుడి కోసం, కట్టుకున్న భర్తను భార్యే సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చి హత్య చేయించింది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో హనీమూన్ మిస్సింగ్ ఘటన వెలుగుచూసింది.
హనీమూన్‌తో అందంగా ప్రారంభమైన ఓ జంట వైవాహిక జీవితం, అంతలోనే విషాదం అంచున నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన నూతన దంపతులు హనీమూన్ కోసం సిక్కిం వెళ్లి ప్రమాదవశాత్తూ మిస్సింగ్ అయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనం తీస్తా నదిలో పడిపోయింది. గత 12 రోజులుగా ఎంత అన్వేషిస్తున్నా ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 1,000 అడుగుల లోతులోకి వాహనం జారుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కూడా సంక్లిష్టంగా మారిపోయింది. నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్‌కు ఈ విషాదం ఎదురైంది.
Read this- RCB Stampede: హైకోర్టుకు వెళ్లిన ఆర్సీబీ.. ఎందుకో తెలుసా?
మే 5న వివాహనం
కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ దంపతుల వివాహం మే 5న అట్టహాసంగా జరిగింది. మే 24న హనీమూన్ కోసం సిక్కిం చేరుకున్నారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడడానికి, విస్తారమైన వర్షాలకు బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతమైన మంగన్ జిల్లాలో ఉన్న మున్సితాంగ్‌ను వారు సందర్శించారు. ప్రమాదం జరిగిన రోజు చుంగ్‌థాంగ్ నుంచి గ్యాంగ్‌టక్‌కు తిరుగు పయనమయ్యారు. వర్షం పడడంతో తడిసిన రోడ్డుపై వెళుతున్న వాహనం ప్రమాదవశాత్తూ జారి కింద ఉన్న నదిలో పడిపోయింది.
ఆ సమయంలో వాహనంలో 11 మంది పర్యాటకులు, డ్రైవర్ ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. డ్రైవర్ మృతి చెందాడని, మరో ముగ్గురు ప్రయాణికులను సురక్షితంగా రెస్క్యూ చేశామని తెలిపారు. అయితే, యూపీకి చెందిన నూతన దంపతులు, ఒడిశా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి ఇతిశ్రీ జెనాతో పాటు మరో 8 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గురైన వాహన శిథిలాలు బురద కింద కూరుకుపోయానని రెస్క్యూ బృందం తెలిపింది. బురదలో కూరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారిందని స్థానిక ఎస్పీ సోనమ్ డెట్చు భూటియా తెలిపారు.
Read this- IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?
ఈ ప్రమాదంపై కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ స్పందిస్తూ, రెస్క్యూ ఆపరేషన్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయాలని వేడుకుంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ‘‘మా పిల్లలు లేకుండా మేము సిక్కిం నుంచి వెళ్లబోం. వారిని గుర్తించడంలో సాయం మాత్రమే కోరుతున్నాం’’ అని భావోద్వేగంతో అన్నారు. కాగా, ప్రమాదం జరిగిన స్థలంలో పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏవీ కౌశలేంద్ర, అంకితకు సంబంధించినవి లేవని అధికారులు అంటున్నారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని ఎన్డీఆర్ఎఫ్, సిక్కిం పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.