Mahabubabad Tragic Incident(image credit:X)
నార్త్ తెలంగాణ

Mahabubabad Tragic Incident: కబలించిన మృత్యువు.. విద్యుత్ షాక్‌తో నవ వరుడు మృతి..

Mahabubabad Tragic Incident: కాళ్లపారాణి ఆరకముందే నవ వధువుకు భర్త దూరం అయ్యాడు. రిసెప్షన్ జరగవలసిన ఇంట్లో.. పెండ్లి కుమారుడు విద్యుత్ షాక్ ‌తో మృతి చెందడంతో వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం గౌరారం శివారు కోడి పుంజుల తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన ఆనందంతో  ఎంతో సంతోషంగా గడుతున్న ఆ యువకున్ని మృత్యువు కరెంట్ షాక్ రూపంలో పలకరించింది.

కోడి పుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 19 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కంకిపాడు లో వివాహం జరిగింది. అయితే వరుడి ఇంటి దగ్గర రిసెప్షన్ జరగాల్సి ఉండటంతో.. ఇంట్లో మంచి నీటి కోసం నరేశ్ విద్యుత్ మోటార్ పెడుతుండగా షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కోటి ఆశలతో, కొండంత బాధ్యతలతో పెళ్లి చేసుకున్న నవ వరుడి మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also read: Karimnagar Railway Station: స్వర్గం లాంటి రైల్వే స్టేషన్.. సౌఖర్యాలు చూస్తే మతి పోవాల్సిందే!

ఎంతో ఇష్టపడిపెద్దల సమక్షంలో తాళి కట్టి.. ఏడడుగులు నడిచిన భర్త మరణ వార్తతో తీవ్ర షాక్ కు గురైన పెండ్లి కుమార్తె జాహ్నవి ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాల్సిన ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు