Mahabubabad district: గణేష్ ఉత్సవాలను జిల్లా లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్, పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో జిల్లా లో పోలీస్ స్టేషన్ ల వారీగా నమోదు అయిన కేసుల వివరాలు, ఆయా కేసులలో అధికారులు చెందించిన పురోగతి నీ పరిశీలించారు.
Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ 9 కి జబర్దస్త్ నటుడు.. ఎంట్రీ కోసం ఏం చేశాడో తెలుసా?
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలి
నేర సమీక్షా లో భాగంగా రానున్న గణేష్ నవరాత్రి(Ganesh Navratri) ఉత్సవాలను పురస్కరించుకుని, జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు
అనంతరం పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి, వాటికి గల కారణాలను తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గంజాయి రవాణా, పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యా ల నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామలలో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకోవడం ద్వారా వాటి పలితంగా జరిగే పెద్ద నేరాలను జరుగకుండా ఆపొచ్చన్నారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలో బీట్ సిస్టం ను మరింత మెరుగుపరచాలని, లాక్ వేయబడిన ఇండ్లను ముందు గా గుర్తించి నైట్ బీట్ లో అలాంటి ఇండ్ల పై దృష్టి పెట్టి ప్రాపర్టీ నేరాలు జరుగకుండా చూడాలని అన్నారు.
అవగాహన పెంచాలి
నమోదు అయినా కేసులలో అరెస్ట్ పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. షీ టీం ద్వారా ఈవ్ టిజింగ్ వంటివి జరుగకుండా అరికట్టాలని అన్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నందున ప్రజల్లో వాటిపై మరింత అవగాహన పెంచాలని, సైబర్ వారియర్స్ కు రోజు తగిన సూచనలు ఇస్తూ సైబర్ బాధితులకు హోల్డ్ చేసిన అమౌంట్ రిఫండ్ అయ్యేలా చూడాలని అన్నారు. ఆయా కేసులలో పెండింగ్ వారెంట్‌లను అమలు చేయాలని, సూచించారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించి, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డి. ఎస్పీ లు తిరుపతి రావు, క్రిష్ణ కిషోర్ , శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, డి సి ఆర్ బి సీఐ, ఇతర సీఐ లు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, ఐటీ, డీసీఅర్బీ విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Also Read:Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు