Fisherman Missing: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో వాగులు వంకలు, చెరువుల మత్తళ్లు వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నాయి. పలు చెరువుల అలుగులు పొంగిపొర్లుతున్నాయి. కొత్తగూడ మండలం బుర్కపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం దాటికి చేపలు పట్టడానికి వెళ్లిన ఆగబోయిన నరేష్(Naresh) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కొత్తగూడ మండలంలోని బూర్కపల్లి వాగుతోపాటు కత్తెర వాగు ముష్మి వాగు గాదేవాగు కార్లయివాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం మండలంలోని పెద్ద చెరువు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గంగారం కోమట్ల గూడెం వెళ్లే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రాకపోకలు భంద్
పంది పంపుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శుద్ధ రేవు అడవి కంబాలపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో స్తంభించిపోయాయి. గూడూరు మండలం వంకమడుగు వాగు విస్తృతంగా ప్రవహిస్తోంది. గూడూరు మండలంలోని పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధిగాంచిన భీముని పాదం, చింతోని గుంపు వంకమడుగు జలపాతాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. సందర్శకులు భీముని పాదం, వంక మడుగు ప్రాంతాల్లో కేరింతలు కొడుతున్నారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండలంలో మున్నేరు వాగు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Also Read: MLA Murali Nayak: పేదల జీవితాల్లో సంతోషం నింపిన ప్రజా ప్రభుత్వం
వరద ఉధృతికి గల్లంతైన నరేష్
బయ్యారం మండలం వినోబా నగర్ సమీపంలోని తులారం ప్రాజెక్టు సైతం పొంగిపొర్లడంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. దాదాపు మహబూబాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పూర్తిస్థాయిలో రహదారులపై ప్రవహిస్తున్నాయి. కొత్తగూడెం మండలంలోని బూర్క వాగు వరద ఉధృతికి గల్లంతైన ఆగబోయిన నరేష్(Naresh) ఆచూకీ కోసం మహబూబాబాద్ డీఎస్పీ ఎన్ తిరుపతిరావు(DSP N Tirupati Rao) క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల మత్తళ్లు రహదారులపై పూర్తిస్థాయిలో ప్రవహిస్తుండడంతో ప్రజలు ప్రయాణాలు సాగించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Gurukul kitchens: పుడ్ పాయిజన్లపై సర్కార్ సీరియస్.. త్వరలో మార్గదర్శకాలు