Jayaprakash Narayan
నార్త్ తెలంగాణ

Jayaprakash Narayan: అవినీతికి చెక్ పెట్టిన పౌరులు.. తెగ పొగిడిన రిటైర్డ్ ఐఏఎస్..

వరంగల్, స్వేచ్ఛ: Jayaprakash Narayan: సమాజాన్ని క్యాన్సర్ల కబళిస్తున్న అవినీతిని అంతం చేయాలంటే ప్రతి పౌరుడు సరిహద్దులోని సైనికుడిలా పోరాడాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలుపుని ఇచ్చారు. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరూ ప్రథమ కర్తవ్యంగా భావించాలని యువతను కోరారు. అవినీతి వ్యతిరేక సంస్థ “జ్వాల” ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ లోని లోక్ సత్తా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.

జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ సబ్ రిజిస్టర్ రామకృష్ణను ఏసీబీకి పట్టించిన శివరాజ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ తహశీల్దార్ మాధవిని ఏసీబీకి పట్టించిన గోపాల్. పిడిసిఎల్ డిఈ స్టేషన్ ఘనపూర్ హుసెయిన్ నాయక్ ను పట్టించిన విజయ్ లను జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్న అవినీతి మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Minister Seethaka: మహిళలకు సూపర్ ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన .మంత్రి సీతక్క.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని సన్మానిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని డిమాండ్ చేశారు. జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. అత్యంత అవినీతి కలిగిన దేశాలలో భారత్ 96వ స్థానంలో ఉందని, ప్రతి ఎట భారతదేశ స్థానం మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అవినీతి పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సక్త రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ కోదండ రామారావు, డాక్టర్ అంజలి దేవి, జ్వాల సభ్యులు అచ్చే అమర్నాథ్ ప్రకాష్, సురేష్ పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!