Huzurabad Belt Shops (IMAGE credit: tywitter)
నార్త్ తెలంగాణ

Huzurabad Belt Shops: బెల్ట్ షాపులకు ​సిండికేట్‌ అధికారుల అండ…? అధిక ధరలకు మద్యం విక్రయాలు

Huzurabad Belt Shops:  నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తూనే బెల్ట్ షాపులపై మద్యం సిండికేట్ మాఫియా పెత్తనం సాగుతున్నారు. వారి ప్రైవేట్ సైన్యంతో అజమాయిషీ చెలాయిస్తున్నారు. అధికారికంగా బెల్ట్ షాపులను నిషేధించినప్పటికీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్(Huzurabad Belt Shops: నియోజకవర్గంలోనీ మండలాల్లోని గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, దీని వెనుక మద్యం సిండికేట్ ప్రభావం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:

​సిండికేట్‌కు అధికారుల అండ…?

హుజురాబాద్ ​పట్టణంలోని తొమ్మిది వైన్ షాపుల యజమానులు ఏకమై ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరు అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నారనే మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అధికారులకు మామూళ్లు ముట్టచెబుతూ తమ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌కు వ్యతిరేకంగా ఎవరైనా బెల్ట్ షాపు నిర్వాహకులు బయట నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తే, వారిపై ప్రైవేట్ సైన్యం దాడి చేస్తోందని, పోలీసుల మాదిరిగా సోదాలు చేసి కేసు నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దసరా వస్తుండడంతో ఈ దోపిడి మరింత ఎక్కువ అవుతుందని మద్యం ప్రియులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

​సామాన్యుడిపై భారం

​ఈ సిండికేట్ చర్యల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేయాలంటే, ఎమ్మార్పీ (MRP) ధర కంటే అదనంగా ₹30 నుంచి బాటిల్ రేంజ్ ను బట్టి రూ. 150 వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీకి కారణమైన సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలని, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పట్టణ, గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.

​మహిళా సంఘాల డిమాండ్

​మహిళా సంఘాలు సైతం ఈ బెల్ట్ షాపుల ఆగడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి, అక్రమ బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే, మద్యం సిండికేట్ వ్యక్తులు ఎంత పెద్ద ఎత్తున ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారో అర్థమవుతోంది. అధికారులు వారికి అండగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేద ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ​ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని, సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు కోరుతున్నారు.

 Also Read: K-Ramp teaser: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్..

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?