Jogulamba Gadwala: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తెల్లవారక ముందే జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో మద్యం అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించడం లేదు. ఈ ఉదాసీనతకు ఎక్సైజ్ శాఖ అధికారులకు మాముళ్లు అందుతున్నాయనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగానే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్మకాలు సాగిస్తూ, సమయ వేళలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: Harish Rao: గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా?.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, మేలచెర్వు చౌరస్తా, జమ్మిచేడు , రాఘవేంద్ర కాలనీలో మొత్తం జిల్లా కేంద్రంలో 8 వైన్ షాపులున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం విక్రయాలు చేపట్టాలి. కాని కొత్తబస్టాండ్, ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్, మేలచెర్వు వైన్ షాపుల పక్కన ఉన్న ఫర్మిట్‌రూమ్ ల్లో నిర్వాహకుల కన్ను సన్నలో మందుబాబులకు తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయాలకు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పర్మిట్ రూమ్ ల చాటున నిర్వాహకులు బహిరంగానే మద్యం విక్రయాలు పాల్పడుతున్నా ఎజ్సైజ్ అధికారులు ఎవరూ అటు వైపు తనిఖీలు చేసిన పాపాన పోలేదన్నా విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామాలలో సైతం
పచ్చని పల్లెలలో సైతం కొందరు విచ్చలవిడిగా బెల్టు షాపులను నిర్వహిస్తూ యథేచ్ఛగా మద్యం అమ్మకాలను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 90, క్వార్టర్, హాఫ్,ఫుల్ కు పరిమాణాన్ని బట్టి అదనంగా వసూలు చేస్తూ కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాల ప్రధాన రోడ్ల పక్కనే తాగుతూ ఉండడంతో పొలం పనులకు, ఇతర గ్రామాలకు రాకపోకలు చేసే మహిళలు, మద్యం సేవించని వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మద్యం సేవిస్తున్నారని దీంతో మా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కావడంతో పాటు వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షాపుల ముందు అపరిశుభ్రత
జిల్లా కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని సమీపంలోని షాపు ఓనర్లు వాపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా షాపుల ముందు బహిరంగానే మద్యం సేవించడంతో ఖాళీ సీసాలు , గ్లాసులు, కాల్చేసిన సిగరెట్ లు దర్శనమిస్తున్నాయి. షాపుల ముందు మూత్ర విసర్జన చేసి పరిసరాలు దుర్గంధం వెదజల్లేలా చేస్తున్నారని, మద్యం షాపు నిర్వాహకులు మొరపెట్టుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. షాపుల ముందు రొచ్చు ఉండటంతో వినియోగదారులు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంలేదని, రొచ్చులో వ్యాపారం ఎలా సాగించాలని వ్యాపారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: V.S. Achuthanandan: కమ్యూనిస్ట్ కురువృద్ధుడు అచ్యుతానందన్ కన్నుమూత