Harish Rao: గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా?
Harish Rao ( image CREDIT: TWITTER)
Political News

Harish Rao: గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా?.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao: గురుకులాల దీనస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) పాలనలో గురుకులాల దీన స్థితిపై ‘ఎక్స్’ వేదికగా  మండిపడ్డారు. 48 గంటల్లో నాగల్‌గిద్ద మోడల్ స్కూల్, పెద్దకొత్తపల్లి, లక్ష్మిపూర్, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ఈ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఫుడ్ పాయిజన్‌ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వ పెద్దలకు మనసు కరగడం లేదా అని హరీశ్ రావు నిలదీశారు.

 Also Read; Telangana Administration: కుదిరితే ఎక్స్ టెన్షన్ లేకపోతే పైరవీలు?

చారిత్రక నేరం

కేసీఆర్ (KCR)  గుర్తులు చెరిపి వేయాలనే లక్ష్యంతో గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండడం చారిత్రక నేరం అన్నారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండడం దుర్మార్గమని విమర్శించారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని చెప్పిన సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేస్తున్నదేంటని అడిగారు.

సీరియస్‌గా తీసుకోవడం లేదు

రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా, 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్‌లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తున నిలబెడితే, కాంగ్రెస్ (Congress) అధఃపాతాళానికి దిగజార్చిందని మండిపడ్డారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుంది, ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని హరీశ్ రావు (Harish Rao)  డిమాండ్ చేశారు

Also Read: GO 49 Suspended: సీఎం ఆదేశాలతో ఫారెస్టు డిపార్టుమెంటు ఉత్తర్వులు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క