Student Suicide: చదువులో నిర్లక్ష్యం వహిస్తున్నాడని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బచ్చన్నపేట(Bachannapet) మండలంలోని లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసు(Police)లు తెలిపిన వివరాల ప్రకారం లింగంపల్లి గ్రామానికి చెందిన మేడబోయిన మల్లయ్య (55) కుమారుడు మేడబోయిన సాయి వర్ధన్ (20) హైదరాబాద్(Hyderabad)లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సాయి వర్ధన్ చదువుపై సరిగా దృష్టి పెట్టడం లేదని తండ్రి మందలించారు.
Also Read:New Syllabus in degree: యూజీ కోర్సులకు కొత్త సిలబస్.. అప్పటి నుండి నుంచే అమలు?
బావి దగ్గర చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య
తండ్రి మాటలకు మనస్తాపం చెందిన సాయి వర్ధన్ (Sai Vardhan) ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తరువాత గ్రామ శివారులోని ఒక బావి దగ్గర చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు(Police)లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయి వర్ధన్ (Sai Vardhan) మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తండ్రి మల్లయ్య పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read:Mp Etela Rajender: ఆ సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండండి: ఈటల రాజేందర్